కేజీఎఫ్‌ హీరో యశ్‌ గురించి ఈ విషయాలు తెలుసా? | Yash Turns 35: Special Story About KGF Hero Yash | Sakshi
Sakshi News home page

యశ్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు

Published Fri, Jan 8 2021 1:23 PM | Last Updated on Fri, Jan 8 2021 3:49 PM

Yash Turns 35: Special Story About KGF Hero Yash - Sakshi

యశ్‌.. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయిన హీరో. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన.. కెజిఎఫ్‌ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒక్క సినిమాతో యశ్‌కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు. ఈ రోజు యశ్‌ 35వ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు  మీకోసం..

యశ్‌ అస‌లు పేరు నవీన్ కుమార్ గౌడ. అభిమానులు ముద్దుగా రాకింగ్‌ స్టార్‌ అని పిలుసుకుంటారు.  జనవరి 8, 1986 న కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో జ‌న్మించాడు యశ్‌.అతని తండ్రి కెఎస్ ఆర్టీసీ రవాణా సేవలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు.

మైసూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత వెంటనే సినీమాలో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తొలూత కొన్ని సీరియల్స్‌లో అవకాశం కొట్టేసిన యశ్‌.. తరువాత సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 2008 లో తన భార్య రాధిక పండిట్ సరసన మోగ్గినా మనసు చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేక ఆదు యశ్‌కు మొదటి ఫిలింఫేర్ అవార్డును సంపాదించింది. ఇక  2016 లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్ద‌రు సంతానం.  ఐరా అనే కూతురు,  యథ‌ర్వ్‌ అనే కొడుకు ఉన్నారు. కూతురు ఐరా 2018 డిసెంబర్‌లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో ఈ జంట యథ‌ర్వ్ కు జన్మనిచ్చింది.

కేజీఎఫ్ మూవీతో తిరుగులేని హీరోగా అవతరించాడు యశ్‌. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  రూ .200 కోట్ల వసూళ్లు చేసిన మొదటి కన్నడ నటుడుగా నిలిచాడు.  కేజీఎఫ్‌ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ ప్రతి ప్రాజెక్టుకు రూ .15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక యశ్‌బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన కేజీఎఫ్ 2 టీజ‌ర్ రికార్డులు సృష్టిస్తుంది. త‌క్కువ స‌మ‌యంలో మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్ రాబ‌డుతూ రికార్డులు కొల్ల‌గొడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement