
యంగ్ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన పవర్‌ఫుల్ చిత్రం 'కేజీఎఫ్'. ఈ సినిమాతో అతను పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాను అద్భుతంగా మలిచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం "కేజీఎఫ్: చాప్టర్ 2"ను తెరకెక్కిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఇందులో రాకీ భాయ్ (యశ్) సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తైపోయింది. ఈ సినిమా నుంచి అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్ బయటకొచ్చింది. (రవీనా ఆగయా)
క్రూరత్వాన్ని పరిచయం చేయబోతున్నాం.. అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అరివీర భయంకర రాక్షసుడు 'అధీర' లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అధీర పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా జూలై 29న ఉదయం 10 గంటలకు నరనరాన రాక్షసత్వం నింపుకున్న అధీర లుక్‌ను లేదా కొన్ని సెకండ్ల నిడివి ఉన్న వీడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 23న విడుదల చేయాలనుకుంటున్నారు. ఒకవేళ అన్‌లాక్ 3.0లో ప్రభుత్వం థియేటర్లకు అనుమతిస్తే, చెప్పిన తేదీకే కేజీఎఫ్ 2 థియేటర్లలో సందడి చేయనుంది. (ఇన్నాళ్లకు కొడుకును చూపించిన హీరో)
Comments
Please login to add a commentAdd a comment