
కేజీఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి అంచాలు లేకుండా విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సినిమా ఇది. ఈ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: మెసేజ్‌లు చేస్తూ డబ్బులు అడుగుతున్న అనుపమ!, హీరోయిన్ క్లారిటీ
ఈ నేపథ్యంలో ఏప్రిల్14న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో పాటు తదితరులు కర్ణాటకలోని కొల్లూర్ శ్రీ మూకాంబికా టెంపుల్, ఉడిపిలోని అనెగుడ్డే వినాయక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ మూవీని సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
చదవండి: వైరల్‌గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా?
Yash and KGF team in anegudde temple#KGFChapter2 #KGF2 #KGF2onApr14 #Yash @TheNameIsYash pic.twitter.com/HJigcajUpi
— K.G.F ANALYST🕵🏼♂️ (@KGFAnalyst) February 1, 2022