
కన్నడ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ టీజర్ వచ్చేసింది. ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్‌ను యశ్ బర్త్ డే స్పెషల్‌గా గురువారం రాత్రి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ షాట్స్ తో పిచ్చిలేపుతోంది ఈటీజర్. ఇలా విడుదల అయిందో లేదో అలా ట్రెండింగ్ వన్ లో దూసుకుపోతోంది. యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ టీజర్ చరిత్ర సృష్టిస్తుంది. అత్యదిక వేగంగా 2 మిలియన్ వ్యూస్ అందుకున్న టీజర్ గా కేజీఎఫ్ 2 నిలిచింది.
వాస్తవానికి జనవరి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. కానీ ముందు రోజు రాత్రి ట్రైలర్ లీక్ అయింది. దీంతో జనవరి 7 రాత్రి ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. విడుదలైన 16 గంటల్లోనే దాదాపు 23 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 30 మిలియన్‌లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు దిశగా పయనిస్తోంది. జోరు చూస్తుంటే కచ్చితంగా 50 మిలియన్ క్రాస్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇక టీజర్ విషయానికొస్తే.. మదర్ సెంటిమెంట్ తో మొదలైంది. చాప్టర్ వన్ లో సీన్స్ ని మరోసారి గుర్తుచేశారు. ‘హిస్టరీ టెల్స్ హజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అదిరిపోయింది. హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్.. చివర్లో యష్ విధ్వంసం.. ఒకటేమిటీ.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. అన్ని కుదిరితే మార్చి 26న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కే జి ఎఫ్ 2 ఒకేరోజు విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment