ఇటీవల దర్శకుడు వెంకటేశ్ మహా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంపై విమర్శలు చేశారు. ఆయన తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని స్పందించారు. ఇలా జరగడం దురదృష్ణకరమని.. అతను అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. తాజాగా దసరా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని మహా కామెంట్స్‌పై స్పందించారు.
నాని మాట్లాడుతూ.. 'ఇటీవల దర్శకులు పాల్గొన్న చర్చా కార్యక్రమాన్ని చూశా. వెంకటేశ్ మహా మాట్లాడిన విధానం సరిగా లేదు. థియేటర్‌లో ఒక సినిమా చూసిన తర్వాత బయటకొచ్చి మన ఫ్రెండ్స్‌తో ఒక విధంగా చెబుతాం. కానీ అదే ఇంటర్వ్యూల్లోకి వచ్చేసరికి అదే మరోలా చెబుతాం. అక్కడ చర్చలోనూ అదే జరిగింది. అందుకే అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సింది. ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నలుగురు దర్శకులు నాకు తెలిసిన వాళ్లే. వాళ్లకు మాస్, కమర్షియల్ సినిమా అంటే ఎంతో ఇష్టం. చిన్న వీడియో క్లిప్ చూసి వాళ్లపై ఒక అభిప్రాయానికి రాను. ఏది ఏమైనా ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం'. అని అన్నారు.
కాగా.. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నందినిరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, వెంకటేశ్ మహా ఓ డిబేట్‌లో పాల్గొన్నారు. కేజీఎఫ్‌ను ఉద్దేశించి వెంకటేశ్ మహా మాట్లాడుతూ..'తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం' అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment