
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి

యష్ అనేది ఇతని అసలు పేరు కాదు. నటుడు అయ్యాక ఇతను పేరు మార్చుకున్నాడు. ఇతని అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్

యష్… 1986 వ సంవత్సరం జనవరి 8 న కర్ణాటకలో హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు

యష్… తండ్రి పేరు అరుణ్ కుమార్. ఈయన కె.ఎస్.ఆర్టీసీ డ్రైవర్.ఇతని తల్లి పేరు పుష్ప లతా. యష్ కు ఒక చెల్లెలు కూడా అంది. ఆమె పేరు నందిని

యష్ విద్యాబ్యాసం అంతా మైసూర్ లో జరిగింది

కన్నడ లో ప్రసారమయ్యే ‘ఉత్తరాయణ’ అనే సీరియల్ ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించాడు

చెల్లెలు నందిని

యష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఓ గాయకుడిగా

యష్ కు జోడీగా రాధికా పండిట్ నటించింది. అటు తర్వాత వీళ్ళిద్దరూ కలిసి 4 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరి పరిచయం కాస్త స్నేహం, అది కాస్తా ప్రేమ, పెళ్ళికి దారితీసింది

2016 ఆగస్టు లో గోవాలో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు

2016 డిసెంబర్ 9 న వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు

2013 లో వచ్చిన ‘గూగ్లీ’, ‘మిస్టర్ అండ్ మిసెస్ రామచారి’ వంటి చిత్రాలు మంచి హిట్ అయ్యి యష్ హీరోగా నిలబడడానికి సహాయపడ్డాయి

’కె.జి.ఎఫ్’ ప్రాజెక్టుకి దర్శకుడు ప్రశాంత్ నీల్ యష్ ను హీరోగా అనుకోలేదు. ముందుగా చాలా మంది హీరోలని సంప్రదించాడు

2018 లో వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్1 మూవీ రూ.250 కోట్లను కొల్లగొట్టి కన్నడలో నెంబర్ 1 మూవీగా నిలిచింది























