
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ ఏడాది ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో నటించనున్నారు? అంటే మొన్నటివరకు కొరటాల శివ పేరు వినిపించింది. కానీ ఎన్టీఆర్ కొత్త సినిమాకు కొరటాల షిఫ్ట్ కావడంతో ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త ఆలోచనలో పడ్డారట. అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో ఆల్రెడీ ‘ఐకాన్: కనబడుట లేదు’ అనే సినిమాను ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఈ సినిమాకంటే ముందు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో బన్నీ సినిమా చేయనున్నారని టాక్. ప్రశాంత్ నీల్, బన్నీ మధ్య ఓ కథ గురించి చర్చలు కూడా జరిగాయని, కాంబినేషన్ కుదిరిందని సమాచారం. ‘ఐకాన్’ కంటే ఈ సినిమాయే ముందు సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని వినికిడి. మరి.. అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు దర్శకుడు ఎవరు? అనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
చదవండి : అల్లు అర్జున్‌ను దారుణంగా అవమానించిన దిల్ రాజు!
Comments
Please login to add a commentAdd a comment