KGF Hero Yash Special Thanks To Fans For 'KGF2 Success', Watch the Video - Sakshi
Sakshi News home page

Hero Yash Comments: 'కేజీయఫ్‌-2' విజయంపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Apr 22 2022 12:15 AM | Updated on Apr 22 2022 9:44 AM

Yash Shocking Comments On KGF-2 Success - Sakshi

Hero Yash Thanks To Fans: 'కేజీయఫ్‌-2' విజయంపై రాకింగ్‌ స్టార్‌ యశ్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ చిత్రం పై ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. ఇక యష్‌ మాట్లాడుతూ.. ''ఓ గ్రామానికి ఒకానొక సమయంలో తీవ్ర కరవు వచ్చింది. అప్పుడు ఆ గ్రామస్థులంతా దేవుడిని ప్రార్థించేందుకు ఓ చోటకు చేరారు. అయితే అందులో ఓ అబ్బాయి మాత్రం అక్కడికి ఓ గొడుగుతో వెళ్లాడు. దాంతో అక్కడున్న వారంతా ఆ అబ్బాయి చేసిన పనికి నవ్వుకున్నారు. అందులో కొందరు అతడిది మూర్ఖత్వమని, మరికొందరు అతివిశ్వాసమని అనుకున్నారు. కానీ అది ఆ అబ్బాయి నమ్మకం, విశ్వాసం మాత్రమే.

అలా అప్పుడు ఆ అబ్బాయి ఏ నమ్మకంతో అయితే ఉన్నాడో 'కేజీయఫ్‌' చిత్రం విషయంలో నేనూ అలానే ఉన్నాను. మొత్తానికి నా నమ్మకాన్ని నిలబెట్టిన మీకు నా తరఫున, చిత్ర బృందం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మాపై మీరు చూపిన ఆదరాభిమానాలకు 'థ్యాంక్స్‌' అనే పదం సరిపోదు.‍ ఓ గొప్ప సినిమాను మీ అందరికీ ఇవ్వాలనుకున్నాం. అనుకున్నట్టుగానే మేము 'కేజీయఫ్‌'ను మీకు అందించాం. దానికి తగ్గట్టుగానే మీరు ఎంజాయ్‌ చేశారు. ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను'' అంటూ యశ్‌ పేర్కొన్నాడు. ఇక చివరిలో చిత్రంలోని 'యువర్‌ హార్ట్‌ ఈజ్‌ మై టెరిటరీ' అనే డైలాగ్‌ చెప్పి వీడియోను ముగించాడు.

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన 'కేజీయఫ్‌-2' చిత్రం ఏప్రిల్‌ 14న విడుదలై వసూళ్ల రికార్డులు సృష్టిస్తోంది. ఇక విదేశాల్లోనూ 'కేజీయఫ్‌' హవా కొనసాగుతోంది. యశ్‌ స్టైలిష్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కు పలువురు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. రవి బస్రూర్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement