
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియన్ చిత్రం ‘కేజీఎఫ్’. 2018 డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. యశ్‌కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతోంది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 21న ‘కేజీఎఫ్-2’ నుంచి యశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసి చిత్రబృందం.. మరోసారి కూడా అదే సెంటిమెంట్‌ను రీపీట్ చేసేందుకు సిద్దమవుతోంది. తమకి ఎంతో కలిసొచ్చిన డిసెంబర్ 21న ప్రేక్షకులకు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఓ ట్వీట్ పెట్టారు.
‘‘కేజీఎఫ్-2’ ముగింపునకు మేము చేరువలో ఉన్నాం. ప్రతిఏడాది డిసెంబర్ 21న అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేసిన మేము ఈ ఏడాది కూడా అదే ఆచారాన్ని ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నాం. మా అధికారిక సోషల్‌మీడియా ఖాతాల వేదికగా.. డిసెంబర్ 21న ఉదయం 10.08 గంటలకు మేము స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాం. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు’ అని చిత్రబృందం పేర్కొంది. రాకీభాయ్ ఇచ్చే స్పెషల్ సర్‌ప్రైజ్ఏంటో తెలియాలంటే డిసెంబర్ 21 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
Here's the much anticipated news of the year! The wait is over! This is for all our crazy fans out there. #KGFChapter2@VKiragandur @TheNameIsYash @prashanth_neel @hombalefilms @duttsanjay @SrinidhiShetty7 @TandonRaveena @bhuvangowda84 @BasrurRavi @Karthik1423 pic.twitter.com/Z7EdeXkzjG
— Prashanth Neel (@prashanth_neel) December 19, 2020