Is Hrithik Roshan Plays Key Role In 'KGF 3'? News Goes Viral - Sakshi
Sakshi News home page

KGF 3లో హృతిక్‌ రోషన్‌!

Published Tue, May 31 2022 12:22 PM | Last Updated on Tue, May 31 2022 12:39 PM

Hrithik Roshan Plays Key Role In KGF 3, News Goes Viral - Sakshi

ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నా,యశ్‌ మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నా....వారిద్దరిని మాత్రం కేజీయఫ్ 3 వదలడంలేదు.ఇప్పటికిప్పుడు ఈ సీక్వెల్ లేదని తెల్సినా సరే కేజీయఫ్ 3పై రూమర్స్ ఆగడం లేదు.కేజీయఫ్ 2 క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 3 కి లీడ్ ఇవ్వడం ఆలస్యం.. చాప్టర్ 3 కి కౌంట్ డౌన్ మొదలుపెట్టారు రాకీభాయ్ ఫ్యాన్స్.దాంతో కేజీయఫ్ 3 సోషల్ మీడియాలో కంటిన్యూ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రూమర్స్ కేజీయఫ్3 పై హైప్ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ గ్రీక్ గాడ్‌ హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడట.

కేజీయఫ్ 2 బాలీవుడ్ స్టార్స్ డామినేషన్ కనిపించింది.రమికా సేన్ పాత్రలో రవీనాటాండన్, అలాగే అధీరా రోల్ ను సంజయ్‌ దత్‌ పోషించాడు.వీరిద్దరి కాంబినేషన్, కేజీయఫ్ లో రాకీభాయ్ ఎలివేషన్ ఈ సీక్వెల్ కు నార్త్ లోనే 430 కోట్లను అందించింది.బాహుబలి 2 తర్వాత హిందీ మార్కెట్ లో ఈ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టిన రెండవ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది కేజీయఫ్2.

కేజీయఫ్ సిరీస్ పై బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను వాడుకునేందుకు,ప్రశాంత్ నీల్ పార్ట్ 3లో డైరెక్ట్ గా అక్కడి స్టార్ హీరో హృతిక్ ను రంగంలోకి దింపుతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రొడ్యుసర్‌ విజయ్‌ కిరంగదూర్‌ మాత్రం ఈ ఏడాదిలో కేజీయఫ్‌-3 ఉండదని, ఈ చిత్రంలో హృతిక్‌ నటిస్తాడో లేడో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.'సలార్' సినిమా మేకింగ్‌లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారని.. అటు యష్ కూడా కొత్త ప్రాజెక్ట్‌కు ప్రకటిస్తారని చెప్పారు. అందరికీ టైమ్ కుదిరినప్పుడు కేజీఎఫ్ 3 గురించి ఆలోచిస్తామన్నారు

 ఈ సంగతి ఇలా ఉంటే,ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సలార్ బడ్జెట్ ను మరో 20 శాతం పెంచారని శాండల్ వుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కేజీయఫ్ 2 రిలీజ్ కు ముందు ఈ సినిమా బడ్జెట్ ను 200 కోట్లు అనుకున్నారట. ఇప్పుడు కేజీయఫ్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ,సలార్ లో అంతకు మించి యాక్షన్ ఉండాలని దాదాపు 40 కోట్లు బడ్జెట్ హైక్ చేసాడట డైరెక్టర్. మొత్తంగా 250 కోట్ల బడ్జెట్ తో సలార్ తెరకెక్కుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement