
గత కొంత కాలంగా యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'కెజిఎఫ్ 2'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాకింగ్ స్టార్ యశ్ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు చాలా అవమానింపబడ్డానని తెలిపాడు. స్కూల్లో తన స్నేహితులంతా భవిష్యత్తులో నువ్వేం అవుతావు అని ప్రశ్నించిన సమయంలో వారంతా డాక్టర్, ఇంజనీర్, లాయర్ అంటూ చెప్పేవారు. కానీ నేను మాత్రం సినిమా యాక్టర్ అవుతానని చెప్పేవాడిని. ఇక దాంతో అందరూ నన్ను చూసి నవ్వేవారు. వారంతా నన్ను అవమానించినట్లుగా మాట్లాడేవారు. అయితే ఆ సమయంలో తనను అలా ఎవరు అవమానించి మాట్లాడినా నేను మాత్రం అనుకున్నట్లుగానే నటుడిని అయ్యేందుకు ప్రయత్నాలు చేశాను. చివరికి మీ ముందు ఇలా నటుడిగా ఉన్నానంటూ హీరో యశ్ చెప్పుకొచ్చాడు.