
Pushpa Movie Collection Bollywood: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ ది రైజ్ గతేడాది డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది.
అటు బాలివుడ్‌లో కూడా పుష్ప రాజ్ తన సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా అక్కడ 'కేజీఎఫ్' రికార్డును ‘పుష్ప’ బద్దలు కొట్టినట్టు సమాచారం. బాలివుడ్ హీరోల సినిమాకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే పుష్పకు వసూళ్ళు రావడం గమనార్హం. ఇలా బన్ని తన మొదటి పాన్ ఇండియా చిత్రంతోనే తిరుగులేని రికార్డు సృష్టించి ఇక తగ్గేదేలే అంటున్నాడు.