
రవిశంకర్, దేవిశ్రీ ప్రసాద్, రష్మిక, అల్లు అర్జున్, సుకుమార్, నవీన్, మిరోస్లా క్యూబా
‘‘పుష్ప’ సినిమా 17న విడుదలవడం అసంభవం అనుకున్నారు.. ఓ రోజు నా కూతురు ఫోన్ చేసి 17న సినిమా రిలీజ్ కాదని అనుకుంటున్నారు అంది. కచ్చితంగా రిలీజ్ చేస్తామని నా కూతురికి మాట ఇచ్చాను. నా కూతురికి, యూనిట్‌కి ఇచ్చిన మాట ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ చాలా వేగంగా చేసి, 17నే సినిమా రిలీజ్ అయ్యేందుకు కష్టపడ్డా’’ అని సుకుమార్ అన్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మొదటి భాగం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆర్య 2’ తర్వాత నేను వాటర్‌లో పడిపోయినప్పుడు బన్నీ (అల్లు అర్జున్) నన్ను పైకి లేపాడు. ‘నీతో ఏడు సినిమాలు చేస్తాను’ అని అప్పుడు తనకు మాటిచ్చా.. ఆ తర్వాత ఇద్దరం టచ్‌లో లేం. లక్కీగా మళ్లీ ‘పుష్ప’ చేశాం. తనపై నాకున్న ప్రేమ అంతా ‘పుష్ప’లో కనిపిస్తుందేమో? దాన్ని మీరంతా ఎంజాయ్ చేస్తారు.
ఈ సినిమా ఇంత బజ్ క్రియేట్ చేయడానికి ఓ కారణం దేవిశ్రీ.. అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. తను నా ఆత్మ అని భావిస్తుంటాను. ఇంతకాలం నన్ను భరించినందుకు నవీన్, రవిగార్లకు థ్యాంక్స్. ఇంత పెద్ద సినిమా జరుగుతున్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు కానీ ఏ రోజూ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు నన్ను. సినిమా చూసినవారు బాగుందని అంటే అప్పుడు నా భారం దిగుతుంది’’ అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నా 17వ సినిమా నువ్వు చేయాలి.. ఓ హిట్ కావాలి అని సుక్కుని అడిగాను. ‘నువ్వూ నేను ఒక్కటే. నీకు పేరొచ్చినా నాకు వచ్చినట్టే.. నాకు వచ్చినా నీకు వచ్చినట్టే’ అన్నారు. ఒక డైరెక్టర్ హీరోని ప్రేమిస్తే ఎలా ఉంటుందో ‘పుష్ప’లో చూస్తారు. దేవిశ్రీ అద్భుతమైన పాటలిచ్చాడు’’ అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌గారి ఆలోచనలు కొత్తగా ఉంటాయి.. వాటిని అల్లుకుపోయే నాలాంటి టెక్నీషియన్స్‌కి ప్రొడక్ట్ కొత్తగానే వస్తుంది. ఈ చిత్రానికి పనిచేసే మాకు కూడా ప్రతి సన్నివేశంలో సర్‌ప్రైజ్ ఉండేలా బన్నీ–సుకుమార్ మంచి మ్యాజిక్ క్రియేట్ చేశారు. సుక్కుగారి ఆలోచనలను బన్నీ ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఈ సినిమాని పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. రష్మిక డీ గ్లామర్‌లోనూ అందంగానే ఉంది. ప్రత్యేక పాటలో నటించిన సమంతకు థ్యాంక్స్’’ అన్నారు. రష్మిక, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కెమెరామ్యాన్ మిరోస్లా క్యూబా బ్రోజెక్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment