పాన్ ఇండియా సినిమాలు వేరు,పాన్ ఇండియా సీక్వెల్స్ వేరు. పాన్ ఇండియా సినిమా హిట్టైతే, ఆ సినిమా నుంచి వచ్చే సీక్వెల్ కు కనివిని ఎరుగని రీతిలో క్రేజ్ కనిపిస్తోంది. ముందు బాహుబలి 2, ఇప్పుడు కేజీయఫ్ 2 .. ఈ ట్రెండ్ చూస్టుంటే నెక్ట్స్ పుష్పరాజ్ కూడా బాక్సాఫీస్ ను రూల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కేజీయఫ్ 2కు వచ్చిన క్రేజ్, ఈ సినిమా బద్దలు కొడుతున్న కలెక్షన్స్ గురించి విన్న తర్వాత పుష్ప టీమ్ లో మరింత జోష్ పెరగడం ఖాయం.పాన్ ఇండియా సినిమాలకు ఒక క్రేజ్ కనిపిస్తే, పాన్ ఇండియా సీక్వెల్స్ కు నెక్ట్స్ లెవల్లో క్రేజ్ కనిపిస్తోంది. అది బాహుబలి 2తో ఒకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు రాఖీభాయ్ రూలింగ్ తో మరోసారి పాన్ ఇండియా సీక్వెల్స్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధమైంది.
బాహుబలి 2, కేజీయఫ్ 2 రిలీజ్ హంగామాను రిపీట్ చేసే అవకాశాలు ఒక్క పుష్ప 2కు మాత్రమే ఉన్నాయి. అంతగా ఈ పుష్ప పార్ట్ 1 ఆడియెన్స్ లోకి వెళ్లింది.అందుకు తగ్గట్లే పుష్ప పార్ట్ 2ను కూడా సుకుమార్ తెరకెక్కించగలిగితే మాత్రం టాలీవుడ్ మరో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం.
మరోవైపు రూ.1000 కోట్లు కొల్లగొట్టిన ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ పై రాజమౌళి మౌనంగా ఉన్నాడు.కాని ఫ్యూచర్ లో బాహుబలి 3ని తీసుకొస్తాను అంటున్నాడు. బాహుబలి 3 థియేటర్స్ కు వచ్చిన రోజున మాత్రం ఇండియన్ సినిమా మరో ఎత్తు ఎదగడం ఖాయం.ఈసారి రాజమౌళి సినిమా మినిమం రెండు వేల కోట్ల వసూళ్లను కొల్లగొట్టడం కన్ ఫామ్.ఎందుకంటే నాలుగేళ్ల క్రితం విడుదలైన బాహుబలి 2 అప్పుడే 1600 కోట్లుకుపైగా కొల్లగొట్టింది. ఫ్యూచర్ లో ఈ సినిమా సీక్వెల్ కు మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే మినిమం 2 వేల కోట్ల మార్క్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
Comments
Please login to add a commentAdd a comment