
సాక్షి,బెంగళూరు : కేజీఎఫ్ హీరో యశ్ వీరాభిమాని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. కర్నాటక మాండ్యా జిల్లా కోడిదొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ (25) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతేకాదు తాను కేజీఎఫ్‌స్టార్ తోపాటు, కర్నాటక మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య ఇద్దరికీ విపరీతమైన అభిమాననని చెప్పుకున్నాడు. అందుకే వారిద్దరూ తన అంత్యక్రియలకు హాజరుకావాలని, అదే తన చివరి కోరిక అని పేర్కొన్నాడు. ఈ మేరకు రామకృష్ట రాసిన సూసైడ్ నోట్ (కన్నడ)కంటతడి పెట్టిస్తోంది.‘తల్లికి మంచి కొడుకుగా, అన్నయ్యకు మంచి సోదరుడిగా మారలేక పోయాను. చివరికి ప్రేమను గెలవడంలో కూడా విఫలమయ్యాను. ఇక జీవితంలో సాధించడానికి ఏమీలేదు’ అంటూ నోట్‌లో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు విషయం తెలిసిన సిద్ధరామయ్య రామకృష్ణ మృతదేహానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో తన అభిమానిని కలుసుకోవడం బాధగా ఉందన్నారు. ఎవరూ ఆత్మహత్యకు పాల్పడకూడదని సూచించారు. ఫ్యాన్స్ అభిమానమే జవం.. జీవం.. మాండ్యా రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది అంటూ హీరో యశ్ ట్విటర్‌లో స్పందించారు. ఈలలు, చప్పట్లు, ప్రేమను మాత్రమే తాము ఇష్టపడతాం కానీ అభిమానులనుంచి తాము ఆశించేది ఇది కాదంటూ రామకృష్ణ మరణంపై యశ్ సంతాపం ప్రకటించారు.
ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನವೇ ನಮ್ಮ ಬದುಕು.. ಜೀವನ.. ಹೆಮ್ಮೆ..
— Yash (@TheNameIsYash) February 18, 2021
ಆದರೆ ಮಂಡ್ಯದ ರಾಮಕೃಷ್ಣನ ಅಭಿಮಾನಕ್ಕೆ ಹೆಮ್ಮೆಪಡಲು ಸಾಧ್ಯವೇ...
ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನಕ್ಕೆ ಇದು ಮಾದರಿಯಾಗದಿರಲಿ.. ಕೋಡಿ ದೊಡ್ಡಿ ರಾಮಕೃಷ್ಣನ ಆತ್ಮಕ್ಕೆ ಚಿರಶಾಂತಿ ಸಿಗಲಿ...
ಓಂ ಶಾಂತಿ...
Comments
Please login to add a commentAdd a comment