రోడ్డు సైడ్ కిరాణా షాపులో పాన్ ఇండియా హీరో.. ఫొటోలు వైరల్ | Rocking Start Yash and his wife Radhika Pandit were Spotted at a small roadside shop - Sakshi
Sakshi News home page

Yash: భార్య కోసం ఆ పనిచేసిన 'కేజీఎఫ్' యష్.. క్యూట్ జోడీ

Published Sat, Feb 17 2024 4:53 PM | Last Updated on Sat, Feb 17 2024 5:02 PM

Kgf Fame Yash In Road Side Shop With Wife Radhika - Sakshi

సినిమా హీరోలు బయట పెద్దగా కనిపించరు. రోడ్ సైడ్ షాప్స్‌లో అయితే వస్తువులు కొనడం, తినడం లాంటివి అస్సలు చేయరు. అలాంటిది పాన్ ఇండియా స్టార్, 'కేజీఎఫ్' హీరో యష్ హఠాత్తుగా ఓ కిరాణా దుకాణంలో ప్రత్యక్ష‍్యమయ్యాడు. పక్కనే అతడి భార్య కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

ఏం జరిగింది?
'కేజీఎఫ్' ఫేమ్ యశ్.. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఉత్తర కర్ణాటక జిల్లా భత్కల్‌లోని షిరాలీకి వెళ్లారు. అక్కడే చిత్రపుర మఠాన్ని సందర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలోనే తన భార్య రాధిక.. ఐస్ క్యాండీ అడగడంతో దగ్గర్లోనే చిన్న దుకాణానికి వెళ్లారు. ఐస్ క్యాండీతో పాటు కొన్ని చాక్లెట్లు కొనుగోలు చేశారు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. యష్ కేరింగ్ చూసి ఫిదా అయిపోతున్నారు. పాన్ ఇండియా హీరో అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా భార్య కోసం ఐస్ క్యాండీ కొనడం చూసి మురిసిపోతున్నారు. ఇకపోతే 'కేజీఎఫ్' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యష్.. ప్రస్తుతం మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'ట్యాక్సిక్'లో హీరోగా చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: సీఎం రేవంత్‌ని కలిసిన అల్లు అర్జున్ మామ.. కారణం అదేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement