
రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్ 2' తర్వాత నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. ఈ సినిమా షూటింగ్‌లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అభిమానులకు సినిమా అందించాలని ఆయన కోరుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్న యశ్ తనతో పాటు ఉన్న వారిని మాత్రం మరిచిపోలేదని చెప్పవచ్చు.
యశ్‌కు దగ్గరైన వ్యక్తుల కుటుంబాల్లో ఏదైన వేడుక జరిగితే ఆయన ఖచ్చింతంగా హాజరవుతారు. ఒక్కోసారి తన సతీమణితో కలిసే వెళ్తారు కూడా.. తాజాగా 'టాక్సిక్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న యశ్.. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇంటికి తన సతీమణితో కలిసి వెళ్లి వారిని సర్‌ప్రైజ్ చేశారు.
యశ్ దగ్గర చేతన్ అనే వ్యక్తి దాదాపు 12 ఏళ్లుగా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఒక రకంగా యశ్ సినిమా కెరియర్ నుంచి అతను ఉన్నాడని చెప్పవచ్చు. చేతన్ 2021లో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్‌లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో కూడా యష్, ఆయన సతీమణి రాధిక పండిట్‌లు చేతన్ పెళ్లి వేడుక జరిపించిన విషయం తెలిసిందే.
(చేతన్ వివాహ సమయంలో.. యశ్, రాధిక పండిట్)
చేతన్ దంపతులకు కొద్దిరోజుల క్రితం కుమారుడు జన్మించాడు. షూటింగ్ పనిలో బిజీగా ఉన్న యశ్ ఈ శుభ సమయంలో చేతన్ ఇంటికి చేరుకున్నాడు. వారి బిడ్డకు బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. దీంతో చేతన్ కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. ఆయన సింప్లిసిటీని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment