ఫైట్స్‌ బ్యాలెన్స్‌ గురూ | KGF Chapter 2 to hit screens on 23 October 2020 | Sakshi
Sakshi News home page

ఫైట్స్‌ బ్యాలెన్స్‌ గురూ

Published Tue, May 12 2020 4:05 AM | Last Updated on Tue, May 12 2020 5:20 AM

KGF Chapter 2 to hit screens on 23 October 2020 - Sakshi

యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’. 2018లో వచ్చిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’కు ఇది సీక్వెల్‌. యశ్‌ ఈ చిత్రంలో రాMీ  భాయ్‌ పాత్రలో నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్, రవీనా టాండన్, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ సినిమాకు సంబంధించి రెండే రెండు ఫైట్స్‌ మినహా టాకీ పార్టు ఆల్మోస్ట్‌ పూర్తయిందని శాండిల్‌వుడ్‌ సమాచారం. ఇక కేవలం 25 రోజుల షూటింగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉందట. ఈ బ్యాలెన్స్‌ షూట్‌లో రెండు యాక్షన్‌ సీక్వెన్స్‌లను తెరకెక్కించాల్సి ఉంది. ఒక ఫైట్‌ యశ్, సంజయ్‌దత్‌ల మధ్య ఉంటుంది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ ఏడాది దసరా సందర్భంగా ‘కేజీఎఫ్‌:చాప్టర్‌’ 2 చిత్రాన్ని అక్టోబరు 23న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement