నాలాంటి అమాయకులను బలిచేయొద్దు: రాజయ్య
వరంగల్: కుట్రపూరిత రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు నాయుడు అని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య విమర్శించారు. ఇరు రాష్ట్రాల్లో సంచలంన సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు.. చేసిన తప్పును ఒప్పుకోవాలన్నారు. ఇలాంటి కేసుల్లో తనలాంటి వాళ్లను బలిచేయడం చంద్రబాబుకు సమంజసం కాదని తెలిపారు. అదే విధంగా ఓటుకు కోట్లు విషయంలో తనను ఏ టీడీపీ నేతలు కలవలేదని స్పష్టం చేశారు. చివరివరకు తెలంగాణ రాజన్నలాగే రాజకీయాల్లో కొనసాగుతానని రాజయ్య తెలిపారు.