ఓటుకు కోట్లు కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇవాళ కూడా న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు. కాగా ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు పాత్రపై విచారణ జరపాలంటూ ఎమ‍్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏసీబీ అడ్వకేట్ సోమవారం కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది.