తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది | ysrcp mla kotamreddy sridharreddy lashes out at chandra babu | Sakshi

తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది

Published Mon, Mar 6 2017 1:04 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది - Sakshi

తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది

అమరావతి: రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో తొలిసారి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ రోజు (సోమవారం) ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పారు.

తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద కోటంరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు ఇష్టమైన వెన్నుపోటు అనే మాటను అస్త్రంగా చేసుకుని గవర్నర్‌ ప్రసంగంలో చదివించారని విమర్శించారు. ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. గత ఎన్నికల సమయంలో తిరుపతిలో ఏడుకొండల వెంకన్నస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. ఎన్నికల్లో గెలిచాక మాట మార్చారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీలను విస్మరించారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement