kotamreddy sridharreddy
-
మా జోలికి వస్తే తాట తీస్తాం.." ఆనం మాస్ వార్నింగ్
-
‘ఖబడ్దార్ చంద్రబాబు.. మీ ఆటలు ఇక సాగవు’
సాక్షి, అమరావతి : గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో ప్రతిపక్షానికి అనేక అవకాశాలు కల్పించామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా తమకు మైకు ఇవ్వలేదని ఆరోపించారు. 63మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నేత జగన్‌కు కూడా మాట్లాడేందుకు అవకాశమే ఇచ్చేవారు కాదని, సభలో ఏదైనా మాట్లాడాలంటే అధ్యక్షా మైకు.. అధ్యక్షా మైకు.. అంటూ బతిమాలుకోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని గౌరవించి మాట్లాడే అవకాశం ఇస్తే దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాని మండిపడ్డారు. వీడ్కోలు సభలో గవర్నర్ స్వయంగా సీఎం జగన్‌ను పాలనను మెచ్చుకున్నారని, అది చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌కు దక్కుతున్న ప్రశంసలు చూసి తట్టుకోలేక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ఖబడ్దార్.. ఖబడ్దార్ చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’ అంటూ శ్రీధర్‌రెడ్డి చంద్రబాబును హెచ్చరించారు. (చదవండి : అబద్ధాలు ఆడటం మాకు తెలియదు: సీఎం జగన్) -
తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది
అమరావతి: రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో తొలిసారి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ రోజు (సోమవారం) ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద కోటంరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు ఇష్టమైన వెన్నుపోటు అనే మాటను అస్త్రంగా చేసుకుని గవర్నర్ ప్రసంగంలో చదివించారని విమర్శించారు. ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. గత ఎన్నికల సమయంలో తిరుపతిలో ఏడుకొండల వెంకన్నస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. ఎన్నికల్లో గెలిచాక మాట మార్చారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీలను విస్మరించారని మండిపడ్డారు. -
తొలిరోజే చంద్రబాబుకు షాక్ తగిలింది
-
ఏపీ బంద్ విజయవంతం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ప్రజలు విజయవంతం చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాటమార్చడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్యని విమర్శించారు. బీజేపీ, టీడీపీలు ప్రత్యేకహోదాకు వ్యతిరేకశక్తులని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేశారని, చంద్రబాబు దేనికోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయమా? పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం కేంద్రంతో రాజీపడ్డారా అని నిలదీశారు. చంద్రబాబుతో చర్చించిన తర్వాతే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి భవిష్యత్ ఉందని, హోదా సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే రాయితీల వల్ల పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమంలోకి రావాలని కోటంరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచి వైఎస్ఆర్ సీపీ, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని చెప్పారు. -
పవన్.. మీరూ ఉద్యమంలోకి రండి
-
'పోయే కాలం వచ్చింది'
హైదరాబాద్: 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలోకి అనుమతించక పోవడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది కనుక వారిని ఎవరూ కాపాడలేరంటూ తీవ్రంగా విమర్శించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని భూదందాలో లక్షలకోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సభా నియమనిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఇందుకు పరాకాష్టగా హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల ఈ ప్రభుత్వ తీరును అందరూ నిరసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్కే రోజాకు అంశంలో జరిగింది, ఒక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి జరిగిన అన్యాయం కాదిది.. న్యాయవ్యవస్థ ఆదేశాలను శాసన వ్యవస్థ బేఖాతరు చేస్తే ఇలాగే ఉంటుందన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం అంటూ తేడా లేకుండా ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి అన్నారు. -
'ఆయన అహంకారం వల్లే..'
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం బేషజాలకు పోకుండా రాష్ట్ర అసెంబ్లీ ప్రతిష్టను కాపాడాలని హితవు పలికారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అహంకార వైఖరి వల్లే ప్రతిపక్ష నేతలకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. అన్ని తనకు తెలుసునన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు సలహాలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. యనమల లాంటి మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తులను పట్టించుకోవద్దని సూచించారు. నేడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతనైనా టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
'టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు'
నెల్లూరు: టీడీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీదర్రెడ్డిలు అన్నారు. పట్టణంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతల అవినీతిని బట్టబయలు చేసినందుకే తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించాలరని వారు ఆరోపించారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో స్టీఫెన్ తో సంభాషించిన ఆడియో టేపులు లభ్యమై, ప్రస్తుతం ఓటుకు కోట్లు కీలక దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. -
పక్కా ప్లాన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మొన్న ఇస్కాన్‌సిటీ పరిధిలో రూ.10 కోట్లు విలువజేసే కార్పొరేషన్ స్థలాన్ని కొందరు అమ్మి సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెలుగులోకి తీసుకురావడంతో కబ్జా బాగోతం బయటపడింది. తాజాగా నెల్లూరు శివారు ప్రాంతమైన జనార్దన్‌రెడ్డి కాలనీలో సుమారు రూ.5 కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కార్పొరేషన్‌లోని ఓ బడా టీడీపీ నేత, అతని అనుచరులు పథకం వేశారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో కబ్జా బాగోతం కాస్త బయటకు పొక్కింది. వివరాల్లో కెళితే... నగరంలోని 54వ డివిజన్ పరిధిలో సర్వే నంబర్ 2062/3లో సుమారు 2.50 ఎకరం ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా కాలనీ పరిధిలోనే మరో 2.50 ఎకరాలను సైతం ఆక్రమించుకునేందుకు పథకం పన్నినట్లు సమాచారం. అందులో భాగంగా ఇటీవల ఓ వ్యక్తి నాలుగు ప్లాట్లు వేసి విక్రయించారు. అందులో ఒక ప్లాటులో రేకుల షెడ్డు కూడా నిర్మించారు. ఒక్కొక్కరుగా స్థలాలను ఆక్రమించుకుంటుండడంతో స్థానికులు అధికారులను కలిశారు. తాము ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాలు లేకుండా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నామని, తమకు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని పంచిపెట్టాలని పలుమార్లు కోరారు. అయితే అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.5 కోట్లకు టెండర్ పెన్నా తీరం శ్మశాన వాటిక సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ముచేసుకునేందుకు టీడీపీకి చెందిన ముఖ్యనేత ఒకరు తెరవెనుక నుంచి మంత్రాంగం నడిపినట్లు విశ్వసనీయ సమాచారం. రెవెన్యూలోని ఓ అధికారి ద్వారా ఈ తంతంగాన్ని పూర్తి చేసి సొమ్ము చేసుకునేందుకు అనుచరులను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఒక్కొక్క ప్లాటును విక్రయించుకుంటూ సొమ్ముచేసుకునేందుకు పథకం వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం పచ్చ జెండాలు పాతినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే విధంగా ప్రభుత్వ స్థలం అంతా హద్దులు ఏర్పాటు చేస్తుండడంతో విషయం తెలుసుకున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. తాము ఏళ్ల తరబడి ఉంటున్నామని, ప్రభుత్వ స్థలాన్ని మీకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కసారిగా స్థానికులంతా గుమికూడా నిలదీయడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డును కూలదోయాలని, అదేవిధంగా హద్దులు చెరిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉంటున్న హిజ్రాలు కొందరు రెవెన్యూ అధికారులను కలిసి ప్రభుత్వ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చిన పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో గౌరవంగా బతకాలంటే ప్రభుత్వ పథకాలు తమకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
'నెల్లూరు మేయర్ అజీజ్ పై అనర్హత వేటు వేయండి'
నెల్లూరు: నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌తోపాటు 12 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అబ్దుల్ అజీజ్ పై చర్య తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు వైస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నియమావళి, నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన అజీజ్ కు మేయర్ గా కొనసాగే హక్కులేదని కోటంరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి నెల్లూరు మేయర్ గా ఎంపికైన అబ్దుల్ అజీజ్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.