సాక్షి, అమరావతి : గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో ప్రతిపక్షానికి అనేక అవకాశాలు కల్పించామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గత టీడీపీ ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా తమకు మైకు ఇవ్వలేదని ఆరోపించారు. 63మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నేత జగన్‌కు కూడా మాట్లాడేందుకు అవకాశమే ఇచ్చేవారు కాదని, సభలో ఏదైనా మాట్లాడాలంటే అధ్యక్షా మైకు.. అధ్యక్షా మైకు.. అంటూ బతిమాలుకోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని గౌరవించి మాట్లాడే అవకాశం ఇస్తే దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాని మండిపడ్డారు. వీడ్కోలు సభలో గవర్నర్ స్వయంగా సీఎం జగన్‌ను పాలనను మెచ్చుకున్నారని, అది చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌కు దక్కుతున్న ప్రశంసలు చూసి తట్టుకోలేక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ఖబడ్దార్.. ఖబడ్దార్ చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకో’ అంటూ శ్రీధర్‌రెడ్డి చంద్రబాబును హెచ్చరించారు.
(చదవండి : అబద్ధాలు ఆడటం మాకు తెలియదు: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment