![Income Tax Officials Seized Some Documents At Revanth Reddy House - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/28/Revanth-reddy_0.jpg.webp?itok=FBC5ka4L)
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’, మనీలాండరింగ్ కేసులలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తోంది. నిన్న ఉదయం ప్రారంభమైన తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డిని 10 గంటలకు పైగా విచారించారు. ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి కోటి రూపాయలు, కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి బంధువుల, సన్నిహితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. (రేవంత్‌కు అరెస్ట్ భయం..!)
కొండాల్ రెడ్డి ఇంట్లో ముగిసిని సోదాలు: రేవంత్ రెడ్డి తమ్ముడు కొండాల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు మగిసాయి. కొండాల్ రెడ్డి భార్యను ఏడు గంటలకుపైగా రహస్య ప్రదేశంలో విచారించారు. పలు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
చదవండి: రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
Comments
Please login to add a commentAdd a comment