
ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్ రెడ్డి (పాత చిత్రం)
సాక్షి, వరంగల్ అర్బన్ : కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తాను జైలుకు పంపిస్తే టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. వరంగల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ఇంటికి ఆ సమయంలో రేవంత్ ఎందుకు వచ్చారని అడిగారు. టీడీపీ నుంచి తాను పార్టీ మారలేదని, టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశానని చెప్పుకొచ్చారు. తనపై ఆరోపణలు చేయడానికి రేవంత్ అనే బ్రోకర్‌ను, బఫూన్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సినిమాల్లో మాదిరిగా ఒక ఐటెం సాంగ్ వేస్తున్నట్లు కాంగ్రెస్ సభల్లో రేవంత్ స్వీచ్‌లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ మరచి స్పీకర్‌పై, తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కండ్లు తెరిచి చూస్తే పాలకుర్తిలో అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపిస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment