తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.