సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మఅన్నారు. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయని ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు నాయుడు బేరసారాలకు దిగారని, ఈ విషయం ఈ రోజు బయటపడ్డ వీడియోలో స్పష్టంగా కనబడుతుందన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడినా..నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ చేసిన తప్పులను ఏపీ, తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!)
ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోలో అడ్డంగా దొరికినా.. ఆ విషయంపై ఇప్పటికీ చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. రూ.కోట్లు కుమ్మరించి రేవంత్ టీమ్ ఎమ్మెల్యేను కొనేందుకు చూశారన్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు దేనికైనా తెగబడతారని ఆరోపించారు. చివరకు ఏపీ ప్రజల ఓట్లు కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనికి ఐటీ గ్రిడ్స్ డేటా చోరీయే నిదర్శనమన్నారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యలను తారుమారు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనను కచ్చితంగా ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. (దొరికిన దొంగ చంద్రబాబు)
Comments
Please login to add a commentAdd a comment