హైదరాబాద్: ఎన్నికల ప్రచార సభల్లో ప్రతి చోట కోట్ల మందికి అన్ననని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, పసుపు– కుంకుమ ఇస్తున్నానని మాట్లాడుతున్నారని.. అసలు అన్న అనే పదానికి సీఎం చంద్రబాబుకు అర్థం తెలుసా? అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిలదీశారు. అన్న అనే పదానికి అర్థం తెలిసిన వాడివైతే షర్మిలపై ఇంత నీచ స్థాయి ప్రచారానికి దిగజారుతారా అని చంద్రబాబును నిలదీశారు. తన రక్తాన్ని పంచుకుపుట్టిన సొంత అక్కచెల్లెళ్లనే దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని, ఆయన కోటరీది మృగ స్వభావమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
సొంత కుటుంబంలోని మహిళలకు అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్రంలో కోటి మంది మహిళలకు న్యాయం చేస్తాడంటే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై విస్తృతంగా జరిగిన దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని స్పష్టమైపోయిందన్నారు. చంద్రబాబు బావమరిది, నందమూరి బాలకృష్ణ బిల్డింగ్‌లో సీఎం కుమారుడు నారా లోకేష్ కనుసన్నల్లో టీఎఫ్‌సీ మీడియా ద్వారా మాటల్లో వర్ణించలేనంత విషప్రచారం జరుపుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారని తెలిపారు. హైదరాబాద్ పోలీసులకు షర్మిల ఇచ్చిన ఫిర్యాదులో తన పరువుప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న సోషల్ మీడియా ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని వివరించారని చెప్పారు. గుంటూరు జిల్లాలోని మంత్రి అనుచరుడు షర్మిలపై వ్యక్తిగత దూషణలకు దిగాడని నిరూపణ అయిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు.
అన్న అనే పదానికి అర్థం తెలుసా చంద్రబాబూ..
Published Fri, Apr 5 2019 1:16 AM | Last Updated on Fri, Apr 5 2019 1:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment