
వచ్చే నెల 29లోపు చంద్రబాబును విచారణ జరుపుతాం
కోర్టులో మెమో దాఖలు చేసిన ఏసీబీ
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ బుధవారం మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విచారిస్తామని ఏసీబీ అధికారులు ఆ మెమోలో పేర్కొన్నారు. గతంలో దాఖలు చేసిన ఛార్జ్సీట్ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. (ఛార్జ్షీట్ నెంబర్ 15/16గా నమోదు చేసుకుంది)
గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. సెప్టెంబర్ 29లోపు చంద్రబాబుపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేత రేవంత్ రెడ్డి, ఉదయసింహా, సెబాస్టియన్లను సెప్టెంబర్ 29న విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది.