టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రేవంత్ రెడ్డికి సంబంధించని అన్ని పత్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అనుమానం ఉన్న ప్రతి విషయం, పత్రాలపై అందుబాటులో ఉన్నవారి నుంచి ఆరా తీస్తోంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటి తాళాలు పగలగొట్టి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.