సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెబుతున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి తప్పించుకోలేరని ఆయన చెప్పారు. చంద్రబాబు తప్పు చేసినట్లు ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయటం ఒక డ్రామాగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ అసెంబ్లీకి చెందిన లేఖను ఆంధ్రప్రదేశ్ సీఎంకు ఇస్తే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌కు దమ్ముంటే రాజీనామా లేఖను తెలంగాణ స్పీకర్‌కు సమర్పించాలని డిమాండ్ చేశారు. కొడంగల్‌లో ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment