MLC Palla Rajeswar Reddy
-
ఓటుకు నోటు.. అస్సలు తప్పించుకోలేరు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెబుతున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి తప్పించుకోలేరని ఆయన చెప్పారు. చంద్రబాబు తప్పు చేసినట్లు ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయటం ఒక డ్రామాగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ అసెంబ్లీకి చెందిన లేఖను ఆంధ్రప్రదేశ్ సీఎంకు ఇస్తే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌కు దమ్ముంటే రాజీనామా లేఖను తెలంగాణ స్పీకర్‌కు సమర్పించాలని డిమాండ్ చేశారు. కొడంగల్‌లో ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. -
మాగ్నటిక్ సంస్థతో సంబంధం లేదు: పల్లా
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళపరుస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంసెట్ పరీక్ష నిర్వహించిన మాగ్నటిక్ సంస్థతో టీఆర్ఎస్ నేతలెవరికీ సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఉనికి చాటుకోవడానికి విమర్శలు చేస్తున్నారన్నారు. లీకేజీ వ్యవహారం బహిర్గతం కాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టిందని, చట్టప్రకారం ముందుకు వెళ్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. గతంలో కూడా చాలాసార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని గుర్తు చేశారు. అసత్య ప్రచారాలతో ప్రతిపక్షాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో మంత్రులకు సంబంధం లేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు.