సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు రాగా.. డిశ్చార్జ్ పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించినందున గడువు ఇవ్వాలని సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయ్సింహా కోరారు. అయితే వారి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం తెలిపింది. డిశ్చార్జ్ పిటిషన్లపై అప్పీల్ పేరుతో గడువు ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఓటుకు కోట్లు కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కోర్టు నిర్ణయించింది. అభియోగాల నమోదుకు మరింత గడువు ఇవ్వాలని నిందితులు కోరగా కోర్టు నిరాకరించింది. ఈ నెల 16న నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర, ఉదయ్ సింహా, సెబాస్టియన్‌లు కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశింది.
చదవండి : ‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి
Comments
Please login to add a commentAdd a comment