సాక్షి, ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలు సమాధానం చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి , ప్రతివాదులను సర్వోన్నత న్యాయస్థానం నోటీసుల్లో పేర్కొంది.
ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ఏసీబీ కోర్టు నుంచి పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లేదంటే ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. బీఆర్‌ఎస్ నేతలైన గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోథ్, మహమ్మద్ అలీలు ఈ పిటిషన్ వేశారు. రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున.. దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాల్ని పిటిషన్‌లో వ్యక్తం చేశారు.
శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
నేటి తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. 2015లో టీడీపీలో ఉండగా ఈ కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే.. తన ‘మాజీ బాస్’, మాజీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ తతంగం నడిచిందంటూ బీఆర్‌ఎస్ నేతలు సైతం పిటిషన్‌లో ప్రస్తావించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment