న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఎనుముల రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కాబట్టి ఈ కేసు విచారణ వేరే (వీలైతే మధ్యప్రదేశ్)కు బదిలీ చేయాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై సుప్రీం నుంచి నోటీసులు అందుకున్న తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి.. తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్‌ను ఇవాళ పరిశీలించిన కోర్టు.. రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు రెండు వారాల సమయం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment