
పొందూరు: ‘ఓటుకు కోట్లు కేసులో ఫోన్ రికార్డ్‌లో నీ గొంతు కాదని దబాయిస్తే.. కాణిపాకంలోని విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేద్దాం రా?’ అని చంద్రబాబుకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని నందివాడలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడారు. మనుషుల్లో దేవుడిని చూసే గొప్ప మానవతావాది సీఎం జగన్ అని, అలాంటి వ్యక్తిపై నిందలు మోపడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చురేపే స్వార్థ, నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.