
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి ఈ కోర్టుకు లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ప్రజాప్రతినిధులపై నమోదు చేసే కేసులను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు సోమవారం మరోసారి విచారించారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదు చేసిన ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉంటుందని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment