ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఓటుకు కోట్లు వ్యవహారం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.