‘‘ఆ కేసు ఏమీ కాదులెండి. వదిలేయండి. అలా కేసులు వేస్తుండడం వారికి అలవాటే. ఇది ఇప్పుడు కొత్తకాదు. ఒకటి అయ్యాక ఇంకొకటి వేస్తూనే ఉంటారు. 26 కేసులు వేశారు. ఏమయ్యాయి?’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి చంద్రబాబుకు నోటీసులు జారీచేయడంపై ఆయన పైవిధంగా స్పందించారు. వెలగపూడి కొత్త తాత్కాలిక అసెంబ్లీ భవనాల్లోని కమిటీ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.