mla rk Petition
-
సుప్రీం నోటీసులపై స్పందించిన చంద్రబాబు
అమరావతి: ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కోర్టుల నుంచి నోటీసులు రావడం సహజమేనని అన్నారు. ఇందులో కొత్తేముందని, చాలాసార్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అసలు ఓటుకు కోట్లు కేసులో ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. తనపైన గతంలో 26 కేసులు వేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. -
చంద్రబాబు తప్పించుకోలేరు
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు నుంచి టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోలేరని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ.. కేసు తీవ్రతను సుప్రీం కోర్టు గుర్తించిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. విచారణ సమయంలో కోర్టుకు వివరాలన్నీ సమర్పిస్తామని చెప్పారు. చంద్రబాబు నిర్దోషి అయితే విచారణకు ఎందుకు భయపడుతున్నారని పొన్నవోలు ప్రశ్నించారు. గతంలో 18 కేసుల్లో విచారణను చంద్రబాబు అడ్డుకున్నారని, ఈ కేసులో మాత్రం దొరుకుతారని చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎవరయినా కేసు వేయవచ్చన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, తప్పు చేస్తే చంద్రబాబుకు శిక్ష పడాల్సిందేనని అన్నారు. బ్రీఫ్డ్ మీ అన్న గొంతు చంద్రబాబుదేనని తేలిందని, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించామని తెలిపారు. తప్పుచేసిన వాళ్లు ఒకటి, రెండు సార్లు తప్పించుకోవచ్చని, ప్రతిసారీ తప్పించుకోలేరని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. -
చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు
-
చంద్రబాబుకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. ఓటుకు కోట్లు వ్యవహారం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లు కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొందరిని డబ్బుతో కొనేందుకు టీడీపీ ప్రయత్నించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఆయన ఇంట్లో ప్రలోభపెడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. అంతేగాక టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్టీఫెన్సన్తో నేరుగా మాట్లాడినట్టు ఆధారాలు బయటపడ్డాయి. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ స్టీఫెన్సన్తో చంద్రబాబు చెప్పినట్టు ఫోన్ రికార్డుల్లో వెలుగుచూసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో బ్రీఫ్డ్ మీ అన్న గొంతు చంద్రబాబుదేనని తేలింది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఏసీబీ కోర్టులో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. సాక్ష్యాల ఆధారంగా చంద్రబాబుపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా.. చంద్రబాబు హైకోర్టులో సవాల్ చేశారు. ఓటు వేసేందుకు లంచం తీసుకుంటే అవినీతి కిందకు రాదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించారు. చంద్రబాబుపై ఏసీబీ కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టివేయగా, ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.