
సుప్రీం నోటీసులపై స్పందించిన చంద్రబాబు
అమరావతి: ఓటుకు కోట్లు కేసులో సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కోర్టుల నుంచి నోటీసులు రావడం సహజమేనని అన్నారు. ఇందులో కొత్తేముందని, చాలాసార్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అసలు ఓటుకు కోట్లు కేసులో ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. తనపైన గతంలో 26 కేసులు వేశారని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ కేసును సమగ్రంగా విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది.