‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ వేగం పుంజుకుంది. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు మంగళవారం అందడంతో ఏసీబీ కసరత్తు ముమ్మరమయ్యింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి సెప్టెంబర్ 29లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెల్సిందే. నెలరోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు