‘ప్రధాని ఫొటోలు అనుమతి లేకుండా వాడొద్దు’
న్యూఢిల్లీ: తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ప్రచురించడానికి వీల్లేదని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) నోటీసులు పంపించింది. కేవీఐసీకి ఈ సందర్భంగా మెమోలు కూడా జారీ చేసింది.
నూతన సంవత్సరం సందర్భంగా ఖాదీ సంస్థ కేవీఐసీ కొత్త డెయిరీ, క్యాలెండర్ విడుదల సందర్భంగా వాటిపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ముద్రించారు. ఇది ధుమారం రేగింది. ఈ సంఘటన జరిగిన నెల రోజుల అనంతరం ప్రధాని కార్యాలయం ఖాదీ కేవీఐసీకి నోటీసులు పంపించింది. ఇక నుంచి ప్రధాని మోదీ ఫొటో ప్రచురణకై మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ద్వారా పీఎంవోను సంప్రదించడం తప్పనిసరి అని కఠిన నిబంధన పెట్టింది.