ఇద్దరు విద్యుత్ ఏఈలకు మెమోలు జారీ
Published Sat, Jun 3 2017 10:54 PM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
కర్నూలు(రాజ్‌విహార్) : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ ఏపీఎస్పీడీసీఎల్ ఏఈలకు ఆపరేషన్స్ ఎస్‌ఈ భార్గవరాముడు శనివారం సాయంత్రం మెమోలు జారీ చేశారు. కర్నూలు మండల ఏఈగా పనిచేస్తున్న నాగేంద్ర ప్రసాద్ అందుబాటులో ఉండటం లేదని వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో ఎస్‌ఈ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో కార్యాలయంలో లేకపోవడంతో ఆయనకు వివరణ కోరారు. ఏఈ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో మెమో జారీ చేశారు. మద్దికెరలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారించగా ఏఈగా పనిచేస్తున్న నారాయణ స్వామి నాయక్ పైఅధికారులు ఏడీఈ, డీఈలకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైనట్లు తేలడంతో ఎస్‌ఈ మెమో జారీ చేశారు.
Advertisement
Advertisement