ఇంజనీర్లకు మెమో | Memo issued for engineers | Sakshi
Sakshi News home page

ఇంజనీర్లకు మెమో

Published Fri, Aug 19 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

Memo issued for engineers

 
 నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట):
ఇరిగేషన్‌శాఖలో వస్తున్న పలు ఆరోపణల నేపథ్యంలో గురువారం ఎస్‌ఈ వి.కోటేశ్వరరావు, సెంట్రల్‌ డివిజన్‌ సీఈ కృష్ణమోహన్‌లు సంగం, కనిగిరి రిజర్వాయర్‌ ప్రాంతాల్లో పర్యటించి పనులను గురువారం తనిఖీ  చేశారు. సంబంధిత సంగం జేఈ, బుచ్చిరెడ్డిపాళెం డీఈ, కొడవలూరు జేఈలు గైర్హాజరు కావడంతో మెమోలు ఇచ్చినట్లు సమాచారం. క్రమశిక్షణ చర్యల కింద ఇచ్చిన మెమోలపై ఎస్‌ఈని వివరణ కోరగా డిపార్ట్‌మెంటల్‌ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అధికారులు ఆయా క్షేత్రాల్లో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సంగం రిజర్వాయర్, సిద్దీపురం మట్టాల్లో పూడికతీతల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయన ఎస్‌ఈ వివరాలు చెప్పడానికి నిరాకరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement