Treasury employees
-
మనోజ్ కేసులో కొత్త ట్విస్ట్.. మధ్యవర్తిగా ‘పెద్ద మనిషి’.. బెడిసి కొట్టిన వ్యూహం..
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ అక్రమాల కేసు సరికొత్త మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో ఫిర్యాదుదారులు కూడా సహ నిందితులని తేలింది. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో డబ్బు రాబట్టుకునేందుకు ‘ఫిర్యాదు’ డ్రామాకు తెరలేపారని నిర్ధారించారు. ‘ఫిర్యాదు’ ప్లాన్‌కు రూపకల్పన చేసిన వారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు తెలిసింది. టీడీపీ బడా నేతల అండదండలు కలిగిన అనంతపురానికి చెందిన రాయల్ శ్రీనివాసులు, దండు వెంకటనాయుడు అలియాస్ డీవీ నాయుడు ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్‌తో జతకట్టారు. అతని సహకారంతో నకిలీ ఎన్ఓసీలు సృష్టించడం, డాక్యుమెంట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేయించడం తదితర అక్రమ మార్గాల ద్వారా అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారు. చదవండి: వచ్చే రెండు రోజులు వర్షాలు ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు.. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వేనంబర్ 513లోని భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం రూ.కోట్లు చేతులు మారాయి. చెప్పిన విధంగా ఎన్ఓసీ చేయించకపోవడంతో భూమి యజమాని తానిచ్చిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. మనోజ్ మాత్రం గడువు మీద గడువు కోరుతూ వచ్చాడు. ఇరువైపులా కమీషన్ తీసుకున్న రాయల్ శ్రీనివాసులుకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఇరకాటంలో పెట్టయినా సరే మనోజ్ నుంచి డబ్బు రాబట్టాలని డీవీ నాయుడుతో కలసి ప్లాన్ వేశారు. రంగంలోకి ‘పెద్ద మనిషి’.. అనుకున్నదే తడవుగా పోలీసు శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ ‘పెద్ద మనిషి’ని రాయల్ శ్రీనివాసులు, డీవీ నాయుడు ఆశ్రయించారు. ఎలాగైనా మనోజ్‌పై ఒత్తిడి పెంచి డబ్బు రాబట్టాలని, మీరు కూడా కావలసినంత దండుకోవచ్చని సలహా ఇచ్చారు. మనోజ్‌ను భయపెట్టడానికి అవసరమైతే అతని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తామని చెప్పారు. దీనికి ‘పెద్ద మనిషి’ సరేనన్నాడు. ఈ పని చేసిపెట్టడానికి ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ను సంప్రదించి.. అనంతపురంలోని పోలీసు అతిథిగృహానికి పిలిపించాడు. మనోజ్‌ను భయపెట్టి, మనకు కావలసినంత డబ్బు రాబట్టుకోవడానికి ఏదైనా మంచి ప్లాన్ ఇవ్వాలని శ్రీనివాసులు, డీవీ నాయుడు కోరారు. ఎన్ఓసీ విషయంలో మనోజ్ మోసం చేశాడని ‘పోలీస్ స్పందన’లో ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. ఆ ఫిర్యాదు నేరుగా తన వద్దకే వస్తుందని, అప్పుడు మన పని సులభమవుతుందంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ పక్కా ప్లాన్ రచించారు. ఇందుకు గాను శ్రీనివాసులు, నాయుడుతో డీల్ కుదుర్చుకున్నారు. వీరికి అనుసంధానకర్తగా ఉన్న ‘పెద్ద మనిషి’కి కూడా రూ.లక్షల్లో ముట్టజెప్పారు. బెడిసి కొట్టిన వ్యూహం.. సీఐ ప్లాన్ మేరకు గత నెలలో రాయల్ శ్రీనివాసులు, డీవీ నాయుడు ‘స్పందన’లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మనోజ్ తమను మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదును ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్‌గా తీసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ)ను రంగంలోకి దింపారు. మనోజ్‌ను ఎస్ఓజీ తన ఆదీనంలో ఉంచుకుంది. తెలుగు తమ్ముళ్లలో ఒకరైన రాయల్ శ్రీనివాసులును సైతం విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. దీంతో మరొక తెలుగు తమ్ముడు డీవీ నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఊహించని విధంగా వ్యూహం బెడిసికొట్టడంతో సదరు సీఐ కంగుతిన్నారు. నిందితులను ఎస్పీ నేరుగా విచారణ చేస్తే తన బండారం బయటపడుతుందని భయపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నిత్యం నిందితుల వద్దే ఉంటున్నట్లు సమాచారం. -
పీఆర్సీ బిల్లులు చేయని అధికారులకు ఛార్జ్ మెమోలు
సాక్షి, విజయవాడ: పీఆర్సీ బిల్లులు చెయ్యని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. మొత్తంగా 27 మందికి మెమోలు జారీ కాగా.. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ అధికారులు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. చదవండి: (కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స) -
అవినీతి ట్రెజర్
-
మనోజ్ 'ఖజానా' చూస్తే కళ్లు తిరగాల్సిందే..
సాక్షి, అనంతపురం : తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతగాడి నుంచి ఏడు బైక్‌లు, రెండు కార్లు, నాలుగు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన అవినీతి సొమ్ము భద్రంగా ఉండేందుకే డ్రైవర్ ఇంట్లో 3.5 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండిని దాచిపెట్టినట్లు అనంతపురం జిల్లా పోలీసుల విచారణలో వెల్లడైంది. బుక్కరాయసముద్రంలో వెలుగుచూసిన నిధి మొత్తం ట్రైజరీ సీనియర్ అకౌంటెంట్ మనోజ్ అక్రమంగా సంపాదించినదే దర్యాప్తులో తేలింది. వాటిని తన ఇంట్లో పెట్టుకుంటే భద్రత ఉండదని భావించిన మనోజ్ తన డ్రైవర్ నాగలింగ ఇంట్లో వీటిని దాచిపెట్టారని గుర్తించారు. ఒక రివాల్వర్, మరొక ఎయిర్ పిస్టల్‌తో పాటు రెండున్నర కిలోల బంగారం, 84 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ, ఆదాయపన్ను శాఖ దృష్టికి వివరాలు పంపుతామని అనంతపురం ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. మనోజ్‌కు కారు డ్రైవర్ నాగలింగతో పాటు మామ బాలప్ప సహకారం ఉన్నట్లు తెలిపారు. (8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు) ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కారు డ్రైవర్ బంధువు ఇంట్లో.. భారీఎత్తున అవినీతి 'ఖజానా' బయటపడిన విషయం తెలిసిందే. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన కిలోలకొద్దీ బంగారం, వెండి, పెద్దఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. అయితే ఇదంతా అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తెలిసి.. అంతా ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు. (ఇంట్లో తవ్వకాలు; బంగారు నిధి పట్టివేత) -
అవినీతి ఖజానా గుట్టురట్టు
-
8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు
అనంతపురం క్రైం/అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లాలో ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి కారు డ్రైవర్ బంధువు ఇంట్లో భారీ ఎత్తున అవినీతి ‘ఖజానా’ బయటపడింది. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన కిలోలకొద్దీ బంగారం, వెండి, పెద్దఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. ఇదంతా అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇందులోనే ఓ ఎయిర్ పిస్టోల్ కూడా లభ్యమైంది. పోలీసుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ► అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో మనోజ్‌కుమార్ అనే వ్యక్తి సీనియర్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడు బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగను కారు డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. ► ఇటీవల సీసీఎస్ పోలీసులకు మనోజ్‌కుమార్, నాగలింగపై ఫిర్యాదు వెళ్లడంతో కొన్ని రోజులుగా వారిద్దరి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ► ఈ క్రమంలో మంగళవారం సీసీఎస్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలోని బృందాలు డ్రైవర్ నాగలింగను అరెస్ట్ చేశారు. ► నాగలింగ ఇచ్చిన సమాచారం ఆధారంగా సాయంత్రం అతడి మామ బాలప్ప ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా.. 8 ట్రంకు పెట్టెలు లభ్యమయ్యాయి. ► వాటిని తెరచి చూడగా కిలోల కొద్దీ బంగారం, వెండి, భారీ మొత్తంలో నగదు వెలుగు చూశాయి. తహశీల్దార్ మహబూబ్ బాషా సమక్షంలో పంచనామా నిర్వహించారు. ► రెండు పెట్టెల్లోని సొత్తును లెక్కించేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. మొత్తం సొత్తును లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది. ► మరోవైపు ఖజానా కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ కేసుపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. ‘కారుణ్య’ నియామకం పొంది.. ► జిల్లా ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్ అవినీతి అనకొండగా ముద్ర వేసుకున్నాడు. అడ్డూఅదుపు లేకుండా అక్రమార్జనకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు. ► తండ్రి పోలీసు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మరణించగా, కారుణ్య నియామకం కింద మనోజ్ కుమార్‌కు 2006 నవంబర్ 17న ట్రెజరీ శాఖలో జూనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ► రెండు మూడేళ్లకే అతడు కార్యాలయంలోనే అత్యంత అవినీతిపరునిగా పేరొందాడు. బదిలీ చేసినా తిరిగి ఇక్కడికే.. ► ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు 14 ఏళ్లుగా ఇతను జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ► గతంలో ఒకసారి ఇక్కడి నుంచి బదిలీ కాగా.. రాత్రికి రాత్రి రద్దు చేయించుకుని తిరిగి అదే స్థానానికి వచ్చాడు. ► గత ఏడాది జూలైలో ధర్మవరం సబ్ ట్రెజరీకి బదిలీ రాగా.. 6 నెలలు పాటు సెలవులో వెళ్లి, తిరిగి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి బదిలీ చేయించుకోవడం గమనార్హం. -
వంద కోట్లకుపైగా నొక్కేశారు!
బోధన్ ట్యాక్స్ స్కాంలో వెలుగులోకి సంచలనాలు ⇒ ఉన్నతాధికారుల పాత్ర ఉందంటున్న సీఐడీ వర్గాలు ⇒ వారిని విచారించేందుకు అనుమతి కోరనున్న అధికారులు ⇒ త్వరలో అరెస్టులకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన కమర్షియల్ ట్యాక్స్ కుంభ కోణం వ్యవహారంలో రూ.100 కోట్లకుపైగా గల్లంతైనట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తొలుత రూ.60 కోట్లు మాత్ర మే పక్కదారి పట్టాయని కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణలో బయటప డగా, సీఐడీ దర్యాప్తు ప్రారంభమైన రెండు రోజుల్లోనే భారీగా అవకతవకలను గుర్తించారు. రూ.100 కోట్లకుపైగా పన్నుల సొమ్మును అధికారులు, బ్రోకర్లు కలిసి నొక్కేశారని తేలింది. ఉన్నతా ధికారుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తం లో ట్యాక్స్ డబ్బులు గల్లంతయ్యాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆడిటింగ్‌లో అడ్డదారి.. బోధన్ సర్కిల్ కార్యాలయంలో పనిచేసిన ఏసీటీవీ, నలుగురు సిబ్బంది బ్రోకర్లతో కలసి ట్రెజరీకి ట్యాక్స్ డబ్బులు చెల్లించినట్టు నకిలీ చలానాలు సృష్టించారు. ఇలా 2012 నుంచి 2015 వరకు దందా సాగించారని సీఐడీ దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు ఏటా జరిగే ఆడిటింగ్ రిపోర్టులోనూ తప్పుడు లెక్కలు చూపించినట్టు తేలింది. సర్కిల్ కార్యా లయాల్లో జరిగిన ఆడిట్ రిపోర్టును కమ ర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారులు సరిగా పరిశీ లించకపోవడం, కొందరు ట్రెజరీ ఉద్యోగులు మామూళ్లు పుచ్చుకుని నకిలీ చలానాలపై దృష్టి సారించలేదని గుర్తించినట్లు తెలిసింది. ఫైలు బూడిద చేశారు బోధన్ సర్కిల్లో పనిచేసిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నకిలీ చలానాలతోపాటు మిల్లర్లు ట్యాక్స్ కట్టినట్టు పక్కాగా రికార్డులు సృష్టించారు. కానీ అలా సృష్టించిన ఖాతా బుక్కులు, డాక్యుమెంట్లను తర్వాత కాల్చేసినట్టు సీఐడీ అనుమానిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా గతంలో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగినట్టుగా బోధన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. తాజాగా కేసులో విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఆ ఘటనపైనా విచారణ జరపబోతున్నారు. ఉన్నతాధికారులను విచారిస్తాం..! బోధన్ స్కాం వ్యవహారంలో కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారులను ప్రశ్నిం చేందుకు అనుమతించాలని సీఐడీ అధికా రులు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడిన ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు కూడా కీలకపాత్ర వహించారని, వారి అండదండలు లేనిదే కింది స్థాయిలో వందల కోట్లు గల్లంతయ్యే అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ కేసులో ఉన్న ఏసీటీవోతో పాటు మరో నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేసేందుకు సీఐడీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్టు తెలిసింది. -
ట్రెజరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు సిద్ధం
- రాష్ట్రవ్యాప్తంగా 436 పెండింగ్ పోస్టులను భర్తీచేయాలి - ఉన్న ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం - విలేకర్ల సమావేశంలో ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ఒంగోలు టూటౌన్: రాష్ట్రంలో ట్రెజరీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రెండు నెలల్లో పరిష్కరించకపోతే ఆందోళనలకు వెనుకాడేదిలేదని ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్ హెచ్చరించారు. సంంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనటానికి జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రెజరీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా నేటికీ చర్యలు తీసుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రాష్ట్రమొత్తం మీద అన్ని జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 436 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న ఉద్యోగులకు పనిభారం ఎక్కువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఒక్కొక్క ట్రెజరీ కార్యాలయంలో 14 అటెండర్ పోస్టులకుగాను కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌కుమార్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పార్ట్‌టైం మసాల్జీలు(చిన్న ఉద్యోగులు)అతితక్కువ వేతనంతో పనిచేస్తూ ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటే నేటికీ కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం రోజుకి రూ.300 ఇవ్వాలని చట్టం చెబుతున్నా దానిని అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహధ్యక్షులు గురుమూర్తి, ఉపాధ్యక్షుడు టీవీ రవీంద్ర, రాష్ట్ర కోశాధికారి హరికుమార్, వెస్ట్ గోదావరి అధ్యక్షుడు డి.కృష్టంరాజు, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కె అహ్మద్, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆ ఉద్యోగి నోరు విప్పితేనే..
చింతపల్లి: విశాఖ మన్యంలో వైద్య ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలకు అంతు లేకుండా పోయింది. కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట రూ. కోట్లు కాజేసిన వైనం ఒకొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ట్రెజరీ ఉద్యోగులతో కుమ్మక్కయి 2010 నుంచి 2014 వరకు సుమారు రూ.10 కోట్లు పక్కదారి పట్టించినట్లు ఖజానాశాఖ ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలో కిందిస్థాయి ఉద్యోగి ఒకరు ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజుతో కలిపి ఈ అక్రమాలకు పాల్పడినట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఉద్యోగి విశాఖపట్నంలో ఉన్నట్టు భోగట్టా. అప్పలరాజుతోపాటు ఆ ఉద్యోగి నోరువిప్పితే ఈ మొత్తం వ్యవహారంలో ఎంతమంది అధికారుల పాత్ర ఉందనేది వెలుగులోకి వస్తుంది. ట్రెజరీ ఉద్యోగి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి రికార్డులు అప్పగించకపోవడంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఆడిట్ అధికారుల విచారణ అనంతరం రికార్డులను పోలీసులకు అప్పగిస్తే దీనిపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లోని 13 పీహెచ్సీలలో అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. వీటిల్లో మొత్తం 43 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఏటా వీరి వేతనాలకు రూ.కోటి వరకు నిధులు అవసరం. ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు బడ్జెట్ నివేదికలను ఏడీఎంహెచ్‌ఓకు అందజేస్తారు. అక్కడి నుంచి ఆశాఖ డెరైక్టర్‌కు నివేదిక చేరాక బడ్జెట్ విడుదల అవుతుంది. కానీ అవసరానికి మించి లేని కాంట్రాక్టు ఉద్యోగులను సృష్టించి 2010 నుంచి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా అప్పటి ఏడీఎంహెచ్‌వో స్వప్నకుమారి ఈ అవినీతి వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా ఖజానా శాఖ ఉన్నతాధికారులకు నివేదికలు అందాయి. మొత్తం 280 మంది నకిలీ ఉద్యోగులను సృష్టించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. 2013-14 ఒక్క ఏడాదికే బోగస్ ఉద్యోగుల పేరిట రూ.2.87 కోట్లు పక్కదారి పట్టించిన విషయం వెలుగులోకి రావడంతో పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్ యువరాజ్ ప్రత్యేక ఆడిట్బృందాన్ని నియమించారు. 2010 నుంచి చెల్లింపులపై కూడా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా పీహెచ్‌సీల రికార్డులను ట్రెజరీ అధికారులు స్వాధీనం చేసుకుని లేని కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజుకు సన్నిహితురాలైన చంద్రకళ, ట్రెజరీ కార్యాలయంలో వ్యక్తిగత సహాయకునిగా పని చేస్తున్న ఎస్.దారబాబుల పేరిట రూ.11 లక్షలు డీడీల రూపంలో చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దారబాబు పేరిట రూ.4.99 లక్షలు డీడీ నంబరు 18279969తో, చంద్రకళ పేరిట రూ.6.27 లక్షలు డీడీ నంబరు 18279934తో అకౌంట్లో జమ చేశారు. వీరిద్దరు అప్పలరాజకు సన్నిహితులు కాగా పీహెచ్సీలలో ఎటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు లేరని నిర్ధారణకు వచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా నమోదు చేసిన పేర్లు, వారి పేరిట చెల్లించిన డీడీల వివరాలను సేకరిస్తున్నారు. -
జీతాల బిల్లులు చేస్తున్న డీటీఓ
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం ఓ వైపు ఉద్యోగులు సమ్మెలో ఉండగా జిల్లా ట్రెజరీ అధికారి కెఎన్‌పి రంగప్ప ఇంట్లో కూర్చొని జీతాల బిల్లులు చేస్తున్నారు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి భాస్కర్ సహాయంతో న్యాయశాఖ, అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ ఉద్యోగుల జీతాల బిల్లులు రాస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ట్రెజరీ ఉద్యోగులు ఆగస్టు 13వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం(ఎస్మా) కింద చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరించడంతో పాటు జీఓ 177 ప్రకారం పని చేయకపోతే జీతాలు ఇవ్వబోమని బెదిరించింది. అయినప్పటీకీ అటెండర్ నుంచి సబ్ ట్రెజరీ అధికారి వరకు సమ్మెలో ఉండగా డీటీఓ మాత్రం బిల్లులు చేయడం వివాదానికి దారితీస్తోంది. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ డీటీఓను వివరణ కోరగా ఖజానాశాఖ రాష్ట్ర డెరైక్టర్ ఆదేశాల మేరకే న్యాయ, అగ్నిమాపక, పోలీసు శాఖల ఉద్యోగుల బిల్లులను చేస్తున్నామని వివరించారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్, జిల్లా శాఖ కార్యదర్శి ప్రసాద్‌రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చే ఇలాంటి చర్యలను తాము ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ట్రెజరీ గెజిటెడ్ అధికారుల సంఘం సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ డీటీఓ బిల్లులు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.