కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం ఓ వైపు ఉద్యోగులు సమ్మెలో ఉండగా జిల్లా ట్రెజరీ అధికారి కెఎన్‌పి రంగప్ప ఇంట్లో కూర్చొని జీతాల బిల్లులు చేస్తున్నారు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి భాస్కర్ సహాయంతో న్యాయశాఖ, అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ ఉద్యోగుల జీతాల బిల్లులు రాస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ట్రెజరీ ఉద్యోగులు ఆగస్టు 13వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు.
ప్రభుత్వం అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం(ఎస్మా) కింద చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరించడంతో పాటు జీఓ 177 ప్రకారం పని చేయకపోతే జీతాలు ఇవ్వబోమని బెదిరించింది. అయినప్పటీకీ అటెండర్ నుంచి సబ్ ట్రెజరీ అధికారి వరకు సమ్మెలో ఉండగా డీటీఓ మాత్రం బిల్లులు చేయడం వివాదానికి దారితీస్తోంది. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ డీటీఓను వివరణ కోరగా ఖజానాశాఖ రాష్ట్ర డెరైక్టర్ ఆదేశాల మేరకే న్యాయ, అగ్నిమాపక, పోలీసు శాఖల ఉద్యోగుల బిల్లులను చేస్తున్నామని వివరించారు.
ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్, జిల్లా శాఖ కార్యదర్శి ప్రసాద్‌రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చే ఇలాంటి చర్యలను తాము ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ట్రెజరీ గెజిటెడ్ అధికారుల సంఘం సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ డీటీఓ బిల్లులు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
జీతాల బిల్లులు చేస్తున్న డీటీఓ
Published Mon, Sep 2 2013 3:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement