pay bills
-
నేడే ఆఖరు
► సమగ్ర వివరాలు సమర్పించిన ఉద్యోగులు 50 శాతమే ► వేతనాలు నిలిపివేస్తామన్నా.. కొరవడిన స్పందన ► ఈరోజు భారీ సంఖ్యలో అందే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమగ్ర సమాచారం అందించడానికి గడువు నేటితో ముగియనుంది. ఇంతవరకు 50 శాతం ఉద్యోగుల వివరాలు మాత్రమే జిల్లా ట్రెజరీ శాఖకు చేరినట్లు తెలుస్తోంది. నిర్ణీత ఫార్మెట్లో వివరాలు అందజేయాలని, లేకుంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలు నిలిపివేస్తామని గత నెలలో ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం, బడ్జెట్ అంచనాలు, ఖాళీగా ఉన్న పోస్టులు తదితర లెక్కలపై స్పష్టమైన సమాచారం రాబట్టడానికి వీలుగా ఈ చర్యలకు ఉపక్రమించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగా ఈనెల 20వ తేదీలోగా శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను అందజేయాలని డిస్బర్సింగ్ అండ్ డ్రాయింగ్ ఆఫీసర్ల (డీడీఓ)కు జిల్లా ట్రెజరీ శాఖ సూచిం చింది. ఆలస్యం చేయకుండా వివరాలు పంపేందుకు వీలుగా ప్రతిశాఖకు నమూనా ఫారాలను కూడా చేరవేసింది. బిల్లులతోనే వివరాలు వాస్తవంగా అన్ని శాఖల నుంచి ఉద్యోగుల పే బిల్లులు ప్రతినెలా 25వ తేదీలోగా ట్రెజరీకి అందుతాయి. వీటి ఆధారంగానే వేతనాలు విడుదల చేస్తారు. ఈ నిర్ణీత తేదీకి ఐదు రోజుల ముందుగానే అంటే 20వ తేదీలోగా వివరాలు తమకు అంద జేయాలని ట్రెజరీ శాఖ అధికారులు చెప్పినప్పటికీ.. పెద్దగా స్పందన రాలేదు. పే బిల్లుల అందజేతకు గడువు నేటితో ముగియనుంది. వివరాల అందజేతకూ ఇదే వర్తిస్తుంది. జిల్లాలో 18 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లు ఉన్నారు. ఇందులో ఇంకా 50 శాతం మంది వివరాలు ట్రెజరీకి అందాల్సి ఉందని సమాచారం. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి చాలా మంది ఉద్యోగులు వివరాలు చేరలేదని తెలుస్తోంది. ఈ శాఖ పరిధిలో జిల్లాలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ర్యాంకు వరకు దాదాపు ఐదు వేల మంది ఉంటా రని అంచనా. వీరిలో దాదాపు రెండు వేల మందే సమర్పించారని సమాచారం. తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల వివరాల పత్రాలను డీడీఓలు సేకరిస్తున్నారు. ఇలా తీసుకున్న ప్రతి ఉద్యోగి సమాచారాన్ని సర్వీస్ పుస్తకంలో ఉన్న అంశాలతో సరిచూ డాల్సి ఉంటుంది. ఇవన్నీ సహేతుకంగా ఉంటేనే ఒకే చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి అధిక సమయం పడు తోం దని అధికారులు వివరిస్తున్నారు. ఈ కారణంగా అందజేతలో కాస్త జాప్యం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. అయితే డీడీఓల నుంచి చివరి రోజు పెద్ద ఎత్తున అందవచ్చని ట్రెజరీ శాఖ భావిస్తోంది. మరోవైపు సాయంతంల్రోగా తమకు చేరిన పత్రాలకు సంబంధించిన ఉద్యోగులకే వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగిలిన వారు అందుకు నోచుకోక పోవచ్చని పేర్కొంటున్నారు. -
రిటైర్డ పవర్
విశ్రాంత ఉద్యోగులా..మజాకా? అర్బన్ ఠాణాలో అడ్డా అవినీతికి నిలయంగా పోలీస్‌స్టేషన్ పైసలిస్తేనే ఫైళ్లకు మోక్షం వారంటే అధికారులకు హడల్ డీఎస్పీ స్థారుు వ్యక్తులకు కూడా ముచ్చెమటలు ఎస్పీ దృష్టిసారిస్తే మేలు మచ్చుతునక.. గీసుకొండ ఠాణాలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌కు రైల్వేశాఖకు బదిలీ అరుుంది. ఇది ఇష్టం లేని సదరు కానిస్టేబుల్ రిటైర్డ్ ఉద్యోగులను ఆశ్రయించాడు. రూ.10 వేలు తీసుకుని పోస్టింగ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. మరో స్టేషన్‌లోని కాని స్టేబుల్‌ను రైల్వేశాఖకు బదిలీ చేశారు. పోస్టుకో డిమాండ్.. ఇంక్రిమెంట్‌కు రూ.1000 నుంచి రూ.2 వేలు, పనిష్మెంట్ చార్జిషీట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, పేబి ల్స్‌కు రూ. 2వేల నుంచి రూ.5 వేలు, బదిలీల్లో పోస్టింగ్ డిమాండ్‌ను బట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. వరంగల్ క్రైం : హన్మకొండ అర్బన్ పోలీసు కార్యాల యం విశ్రాంత ఉద్యోగులకు అడ్డాగా మారిం ది. అవినీతికి ఆలవాలంగా తయారైంది. వారు ఎంత చెబితే అంతే. బదిలీలు, ఇంక్రిమెంట్లు, పనిష్మెంట్, పేబిల్స్ కావాలన్నా వారి చేయి తడపాల్సిందే. వారు పదవీ విరమణ పొందినా తాత్కాలిక ఉద్యోగులు పవర్ చూపిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. జిల్లాలో ‘ఎవర్ విక్టోరియస్’గా ఉన్న పోలీసు సిబ్బందికి కూడా చుక్కలు చూపిస్తున్నారు. అటువంటి అవిశ్రాంత ఉద్యోగులపై కథనం.. ఠాణాలో 15 మంది.. వరంగల్ అర్బన్ పోలీసు కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులు సుమారు 15 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి గతంలో సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి వివిధ హోదాల్లో పనిచేశారు. డ్రాఫ్టింట్ విభాగంలో వీరిది అందవేసిన చేరుు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయూలి. అపార అనుభవంతో విశ్రాంత ఉద్యోగులు లాబీయింగ్ చేసి కీలక విభాగాల్లో అడ్డా వేశారు. వీరు రావడం అప్పట్లో వివాదాస్పదం అరుునప్పటికీ తర్వాత సద్దుమణగడంతో కొనసాగుతున్నారు. ప్రతీ పనికి పైకం అర్బన్ పోలీసు కార్యాలయంలోని కీలక విభాగాలైన బదిలీలు, ఇంక్రిమెంట్లు, పనిష్మెంట్, పేబిల్స్ పనికోసం వీరు నియమితులయ్యారు. ఇవి సిబ్బందికి సర్వీసు పరంగా కీలకంగా నిలుస్తాయి. వీటిలో ప్రతీ ఉద్యోగి రిమార్కులు లేకుండా చూసుకోవాలని చూస్తారు. దీనిని ఆసరా చేసుకుని రిటైర్డ్ ఉద్యోగులు పైలసివ్వనిదే పనిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. 65 నుంచి 70 ఏళ్ల వయసు ఉండి.. నెలకు రూ.40 వేల వరకు పింఛన్ తీసుకుంటున్న ఈ రిటైర్డ్ ఉద్యోగులు కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, సీఐ, డీఎస్పీ వ్యక్తులు పని కావాలంటే చేరుు తడపాల్సిందే. కాగా, జిల్లాలోని వివిధ ఠాణాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ పోలీసు కార్యాలయూనికి వచ్చే సరికి రక్షణ లేకుండా పోతుంది. ఎస్సై, సీఐ ఇంక్రిమెంట్లు, జీపీఎఫ్ చెల్లింపులలో చేతివాటం ప్రదర్శిస్తూ పోలీసు శాఖను అవినీతికి చిరునామాగా మారారనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఇప్పటికైనా అర్బన్ కార్యాలయంలో నెలకొన్ని అవినీతిని ప్రక్షాళన చేయాల్సిన అవరసం ఎస్పీ అంబర్ కిషోర్ఝాపై ఉందని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
బెంగాల్ ప్రభుత్వ ప్రకటనలపై జాగ్రత్త
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తన సభ్యులకు సూచించింది. ఐఎన్ఎస్ కార్యవర్గ కమిటీ సోమవారమిక్కడ సమావేశమైంది. తన సభ్య పత్రికలకు కొన్నింటికి ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రకటనల బిల్లులు చెల్లించకపోవడంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా పరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల డబ్బులు రాక ఈ పత్రికలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి వెంటనే బకాయిలు చెల్లించాలని కార్యవర్గం కోరినట్లు ఐఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి వి.శంకరన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
జీతాల బిల్లులు చేస్తున్న డీటీఓ
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం ఓ వైపు ఉద్యోగులు సమ్మెలో ఉండగా జిల్లా ట్రెజరీ అధికారి కెఎన్‌పి రంగప్ప ఇంట్లో కూర్చొని జీతాల బిల్లులు చేస్తున్నారు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి భాస్కర్ సహాయంతో న్యాయశాఖ, అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ ఉద్యోగుల జీతాల బిల్లులు రాస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ట్రెజరీ ఉద్యోగులు ఆగస్టు 13వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం(ఎస్మా) కింద చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరించడంతో పాటు జీఓ 177 ప్రకారం పని చేయకపోతే జీతాలు ఇవ్వబోమని బెదిరించింది. అయినప్పటీకీ అటెండర్ నుంచి సబ్ ట్రెజరీ అధికారి వరకు సమ్మెలో ఉండగా డీటీఓ మాత్రం బిల్లులు చేయడం వివాదానికి దారితీస్తోంది. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ డీటీఓను వివరణ కోరగా ఖజానాశాఖ రాష్ట్ర డెరైక్టర్ ఆదేశాల మేరకే న్యాయ, అగ్నిమాపక, పోలీసు శాఖల ఉద్యోగుల బిల్లులను చేస్తున్నామని వివరించారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్, జిల్లా శాఖ కార్యదర్శి ప్రసాద్‌రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చే ఇలాంటి చర్యలను తాము ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ట్రెజరీ గెజిటెడ్ అధికారుల సంఘం సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ డీటీఓ బిల్లులు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.