విశ్రాంత ఉద్యోగులా..మజాకా?
అర్బన్ ఠాణాలో అడ్డా
అవినీతికి నిలయంగా పోలీస్‌స్టేషన్
పైసలిస్తేనే ఫైళ్లకు మోక్షం
వారంటే అధికారులకు హడల్
డీఎస్పీ స్థారుు వ్యక్తులకు కూడా ముచ్చెమటలు
ఎస్పీ దృష్టిసారిస్తే మేలు
మచ్చుతునక..
గీసుకొండ ఠాణాలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌కు రైల్వేశాఖకు బదిలీ అరుుంది. ఇది ఇష్టం లేని సదరు కానిస్టేబుల్ రిటైర్డ్ ఉద్యోగులను ఆశ్రయించాడు. రూ.10 వేలు తీసుకుని పోస్టింగ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. మరో స్టేషన్‌లోని కాని స్టేబుల్‌ను రైల్వేశాఖకు బదిలీ చేశారు.
పోస్టుకో డిమాండ్..
ఇంక్రిమెంట్‌కు రూ.1000 నుంచి రూ.2 వేలు, పనిష్‌మెంట్ చార్జిషీట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, పేబి ల్స్‌కు రూ. 2వేల నుంచి రూ.5 వేలు, బదిలీల్లో పోస్టింగ్ డిమాండ్‌ను బట్టి డబ్బు వసూలు చేస్తున్నారు.
వరంగల్ క్రైం : హన్మకొండ అర్బన్ పోలీసు కార్యాల యం విశ్రాంత ఉద్యోగులకు అడ్డాగా మారిం ది. అవినీతికి ఆలవాలంగా తయారైంది. వారు ఎంత చెబితే అంతే. బదిలీలు, ఇంక్రిమెంట్లు, పనిష్‌మెంట్, పేబిల్స్ కావాలన్నా వారి చేయి తడపాల్సిందే. వారు పదవీ విరమణ పొందినా తాత్కాలిక ఉద్యోగులు పవర్ చూపిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. జిల్లాలో ‘ఎవర్ విక్టోరియస్’గా ఉన్న పోలీసు సిబ్బందికి కూడా చుక్కలు చూపిస్తున్నారు. అటువంటి అవిశ్రాంత ఉద్యోగులపై కథనం..
ఠాణాలో 15 మంది..
వరంగల్ అర్బన్ పోలీసు కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులు సుమారు 15 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి గతంలో సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి వివిధ హోదాల్లో పనిచేశారు. డ్రాఫ్టింట్ విభాగంలో వీరిది అందవేసిన చేరుు. నిబంధనల ప్రకారం ఈ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయూలి. అపార అనుభవంతో విశ్రాంత ఉద్యోగులు లాబీయింగ్ చేసి కీలక విభాగాల్లో అడ్డా వేశారు. వీరు రావడం అప్పట్లో వివాదాస్పదం అరుునప్పటికీ తర్వాత సద్దుమణగడంతో కొనసాగుతున్నారు.
ప్రతీ పనికి పైకం
అర్బన్ పోలీసు కార్యాలయంలోని కీలక విభాగాలైన బదిలీలు, ఇంక్రిమెంట్లు, పనిష్‌మెంట్, పేబిల్స్ పనికోసం వీరు నియమితులయ్యారు. ఇవి సిబ్బందికి సర్వీసు పరంగా కీలకంగా నిలుస్తాయి. వీటిలో ప్రతీ ఉద్యోగి రిమార్కులు లేకుండా చూసుకోవాలని చూస్తారు. దీనిని ఆసరా చేసుకుని రిటైర్డ్ ఉద్యోగులు పైలసివ్వనిదే పనిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. 65 నుంచి 70 ఏళ్ల వయసు ఉండి.. నెలకు రూ.40 వేల వరకు పింఛన్ తీసుకుంటున్న ఈ రిటైర్డ్ ఉద్యోగులు కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, సీఐ, డీఎస్పీ వ్యక్తులు పని కావాలంటే చేరుు తడపాల్సిందే. కాగా, జిల్లాలోని వివిధ ఠాణాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ పోలీసు కార్యాలయూనికి వచ్చే సరికి రక్షణ లేకుండా పోతుంది. ఎస్సై, సీఐ ఇంక్రిమెంట్లు, జీపీఎఫ్ చెల్లింపులలో చేతివాటం ప్రదర్శిస్తూ పోలీసు శాఖను అవినీతికి చిరునామాగా మారారనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఇప్పటికైనా అర్బన్ కార్యాలయంలో నెలకొన్ని అవినీతిని ప్రక్షాళన చేయాల్సిన అవరసం ఎస్పీ అంబర్ కిషోర్‌ఝాపై ఉందని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.
రిటైర్‌డ పవర్
Published Sun, Feb 22 2015 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement