kadapa collectorate
-
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
సాక్షి, కడప : తమకు ఏడు నెలలుగా నిలిపివేసిన జీతాలు, పారితోషికం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద ఏఐయూటీసీ ఆ«ధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు జి.వేణుగోపాల్, అధ్యక్షురాలు సుభాషిణి, ప్రధాన కార్యదర్శి అయ్యవారమ్మ ఈ సందర్బంగా మాట్లాడుతూ పెండింగ్ జీతాలు ఇవ్వాలని పలుమార్లు కోరినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. ఇందువల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వివరించారు. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులైందని, పిల్లలకు ఫీజులు, పుస్తకాలు కొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కేవలం రూ 150 పారితోషికంతో గత 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు అనారోగ్య కారణాలుగా కొన్నిరోజులు విధులకు హాజరు కాలేదని, ఈ కారణంగా పీహెచ్సీ అధికారులు వారిని డ్రాపౌట్స్ చేశారని తెలిపారు. డ్రాపౌట్‌కు గురైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశాలపై పీహెచ్సీ అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులు ఆపాలని అన్నారు. కొంతమంది ఆశాలను విధులకు రావద్దని రాజకీయ నాయకులకు అనుకూలంగా పీహెచ్సీ అధికారులు ఆదేశాలు ఇవ్వడం సరికాదని చెప్పారు. స్థానిక రాజకీయ నాయకుల అనుచరులను ఆశాలుగా నియమించుకునే వీలును పీహెచ్సీ అధికారులు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఆశాలు రాజీనామాలు చేయాలంటూ బెదిరింపులకు పాల్పడటాన్ని తక్షణమే ఆపాలన్నారు. వీటిపై విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు రూ. 10 వేలు జీతం, పాత పద్దతి ప్రకారం ఇస్తామన్న పారితోషికానికి సంబంధించిన జీఓలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు.. కడప సెవెన్‌రోడ్స్ : మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన ఆరు నెలల వేతనాలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవా«ధ్యక్షులు ఎస్.చాన్‌బాషా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో కొనసాగుతున్న కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా భోజనాలు వడ్డిస్తున్నారని చెప్పారు. కూరగాయల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి వారి కార్యకర్తలను నియమించుకునే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరమని అన్నారు. ఫిబ్రవరి నుంచి గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతూ గత ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని, అయితే నేటికీ జీఓ అమలుకు నోచుకోలేదన్నారు. అనంతరం కలెక్టర్ హరి కిరణ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. యూనియన్ అధ్యక్షురాలు రేణుకమ్మ, సులోచనమ్మ, వెంకట శివ, మేరి, అమరావతి, అబ్దుల్ ఘని, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. కడప సెవెన్‌రోడ్స్ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన ఆరు నెలల వేతనాలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవా«ధ్యక్షులు ఎస్.చాన్‌బాషా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో కొనసాగుతున్న కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా భోజనాలు వడ్డిస్తున్నారని చెప్పారు. కూరగాయల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి వారి కార్యకర్తలను నియమించుకునే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరమని అన్నారు. ఫిబ్రవరి నుంచి గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతూ గత ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని, అయితే నేటికీ జీఓ అమలుకు నోచుకోలేదన్నారు. అనంతరం కలెక్టర్ హరి కిరణ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. యూనియన్ అధ్యక్షురాలు రేణుకమ్మ, సులోచనమ్మ, వెంకట శివ, మేరి, అమరావతి, అబ్దుల్ ఘని, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహా, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలకు అదుపు లేకుండా ఉందని అన్నారు. ఐఐటీ, టెక్నో, ఈ–టెక్నో, ఒలింపియాడ్, నేషనల్, ఇంటర్నేషనల్, ఏసీ క్యాంపస్ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు, షూ, యూనిఫాం వంటివి పాఠశాలల్లోనే అమ్ముతూ విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు. విచ్చలవిడిగా ఫీజుల దందా కొనసాగిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లకు ఉచిత విద్య అందించాలన్నారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాయక్, రాజేంద్ర, డీవైఎఫ్ఐ నాయకులు జగదీష్, స్టీఫెన్, ఎస్ఎఫ్ఐ నాయకులు సునీల్, ఐద్వా నాయకురాలు ఐఎన్ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మా గోడు ఎవరికీ పట్టదా ?
కడప సెవెన్‌రోడ్స్ : ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయుల, అధ్యాపకుల శ్రమను దోపిడీ చేస్తున్నా ప్రభుత్వానికి పట్ట డం లేదని రాష్ట్ర ప్రైవేటు టీచర్ల, లెక్చరర్ల యూనియన్ నాయకులు విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పిలుపులో భాగంగా శనివా రం కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయభారత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డి.సుబ్రమణ్యం మాట్లాడుతూ తమకు పనిభారం విపరీతంగా ఉం దని తెలిపారు. ఆదివారం, రెండో శనివారం, జాతీయ సెలవు దినాలు తమకు విద్యా సంస్థలు వర్తింప చేయడం లేదని ఆరోపించారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సైతం సమయం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రోజుకు 10 గంటలు తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నప్పటికీ, వేతనాలు మాత్రం అరకొరగానే ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్లకు ఇచ్చే వేతనా లను తమకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక పనిగంటలకు ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. జీఓ నంబరు 1ని అమలు చేయాలని చేయాలన్నారు. తమకు చట్టపరంగా లభించాల్సిన పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యాలను యాజమాన్యాలు కల్పించడం లేదన్నారు. తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దపాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలే తమ ఈ దుస్థితికి కారణమని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల తాము పొట్ట కూటికోసం ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేయాల్సిన దుర్గతి దాపురించిందన్నా రు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఆర్సీపీ నాయకుడు నరసింహా, ఆర్టీయూ నాయకులు గంగన్న, సుబ్బయ్యలు సంఘీభావం ప్రకటించారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు రాజు, రాయపురెడ్డి, బాబానుబాష, వెంకటేష్ పాల్గొన్నారు. -
భార్య కాపురానికి రావడంలేదని..
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్లో కలకలం రేగింది. కలెక్టరేట్ వద్ద పులివెందులకు చెందిన ఓ వ్యక్తి. కొడుకుతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గమనించిన సిబ్బంది తండ్రీకొడుకుని రిమ్స్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. కాగా గత కొంతకాలంగా తన భార్య కాపురానికి రావడంలేదని సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన సమస్యను పట్టించకోలేదని.. అందుకే ఆత్మహత్యకు యత్నించినట్టు అతను అరోపిస్తున్నాడు. -
కడప కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్సీపీ ధర్నా
-
ఇది అసమర్థ ప్రభుత్వం
వీరపునాయునిపల్లె: రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం ఉండటం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనా«థరెడ్డి అన్నారు. సెప్టెంబర్ 3న నిర్వహించే మహా ధర్నాపై చర్చించేందుకు బుధవారం ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అబద్దపు హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక ప్రజలతో పనేముంది అనే రీతిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2012 రబీ సీజన్ బుడ్డశెనగ బీమా జిల్లాలో ఇంకా 13 వేల మందికి అందలేదని అన్నారు. సీఎం ఇప్పటివరకు 14 సార్లు జిల్లాలో పర్యటించినా అభివద్ధి ఏమాత్రం లేదన్నారు. జిల్లాపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపుతున్నాడని విమర్శించారు. వైఎస్ హయాంలో నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపడం లేదన్నారు. గండికోటకు నీరు ఇస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో చిత్తశుద్ది చూపడం లేదని అన్నారు. సెప్టెంబర్ 3న కడప కలెక్టరేట్ ఎదుట జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి హాజరువుతారని చెప్పారు. సమావేశంలో మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మకాయల సుధాకరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరప్రతాపరెడ్డి, మండల నాయకులు అలిదెన వాసు, విశ్వనాధరెడ్డి, రైతు విభాగం మండల అ«ధ్యక్షుడు బాస్కరరెడ్డి, çపార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. -
జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం
కడప కోటిరెడ్డి సర్కిల్: జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, లక్ష హెక్టార్లలో ఉద్యాన పంటలు పండించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారులతో సూక్ష్మ, నీటిసాగులో సాంకేతిక అంశాల ప్రముఖ్యతపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10 లక్షల హెక్టార్లలో పంట సాగుకు అవకాశం ఉండగా, అందులో ప్రస్తుతం నాలుగు లక్షల హెక్టార్లలోనే సాగు జరుగుతోందన్నారు. ఆరు లక్షల హెక్టార్లలో పంట విస్తీర్ణానికి జిల్లాలో అవకాశం ఉందన్నారు. లక్ష హెక్టార్లలో బిందుసేద్యం లక్ష్యం కాగా, ప్రస్తుతం 22 వేల హెక్టార్లలో బిందుసేద్యం ద్వారా ఉద్యాన పంటలు పండించేందుకు దరఖాస్తులు అందాయన్నారు. వాటిని పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రభుత్వం సూక్ష్మనీటి సాగుకు, పరికరాల కొనుగోలుకు రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు సబ్సిడీ పెంచిందన్నారు. పరికరాలు సరఫరా చేసే కంపెనీలో లాభాపేక్షతో కాకుండా నాణ్యమైన, ఎక్కువకాలం మన్నికగల పరికరాలను రైతులకు అందించి వాటి వినియోగంలో ఉన్న సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్లు, కంపెనీల ఇంజనీర్లు, ఏరియా అధికారులు, జిల్లా కో ఆర్డినేటర్లు గ్రామాల్లో తిరిగి రైతుల్లో అవగాహన కల్పించి సూక్ష్మ నీటిసాగుపై ప్రేరణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్లు, ఏరియా అధికారులు, జిల్లా కో ఆర్డినేటర్లు, సూక్ష్మ సాగు పరికరాలు సరఫరా చేసే ప్రతినిధులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్‌పై జాతీయ జెండా ఏదీ?
అది పరిపాలనకు కేంద్రమైన కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం. అక్కడ అంతా జిల్లా అధికారులే ఉంటారు. అయినా ఆ కార్యాలయంపై మువ్వన్నెల జాతీయ పతకాన్ని ఎగుర వేయడాన్ని విస్మరించారు. రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రభుత్వ కార్యాలయాలపై జెండాను విధిగా ఉంచాలి. మే 23 నుంచి కొత్త భవనంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కలెక్టర్, జేసీ, జేసీ–2, డీఆర్వో ఇంత మంది అధికారులు రోజూ కార్యాలయానికి వస్తూ పోతూ ఉన్నారే గానీ, జాతీయ జెండా గురించి ఎవరికీ స్పురణకు రాకపోవడం విచారకరం. కడప కల్టెరేట్ -
కడప కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ 'హోదా' ఆందోళన
కడప : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ మంగళవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘరామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు అంజాద్బాష, శ్రీనివాసులు, రాచమళ్ల ప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, మేయర్ సురేష్ బాబుతో వందలాది కార్యకర్తలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదులు చేశారు. -
కడప కలెక్టరేట్లో ఉద్రిక్తత
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రుణమాఫీ ఫిర్యాదులు కోసం రైతులు కలెక్టరేట్ ఆవరణంలోకి చొచ్చుకు వచ్చారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గోడు పట్టదా అంటూ అధికారులను నిలదీశారు. రైతు సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి రైతులు తరలి వచ్చారు. -
కడప ట్రెజరీలో క్షుద్ర పూజలు
కడప సెవెన్‌రోడ్స్ : కడప కలెక్టరేట్ ఆవరణంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో క్షుద్ర పూజలు నిర్వహించారన్న విషయం కలకలం సృష్టిటించింది. అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న నాగరాజు మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు తన కార్యాలయానికి వచ్చారు. తన కుర్చీ వద్ద నిమ్మకాయలు, కుంకుమ, ఎండు మిరపకాయతో పూజలు నిర్వహించి ఉండటాన్ని గమనించి విషయాన్ని డిప్యూటీ డెరైక్టర్ రంగప్ప దృష్టికి తీసుకెళ్లారు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారితో ఈ సంఘటనపై విచారణ చేయిస్తానని, స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని ఆయన చెప్పారు. అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. తానంటే గిట్టని సిబ్బంది ఎవరో క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. పది రోజుల కిందట కూడ నల్ల జిలకర మంత్రించి తన కుర్చీ వద్ద చల్లారని తెలిపారు. బద్వేలు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఓ ఉద్యోగి రూ.26 లక్షలు స్వాహా చేయడంపై తాను విచారణ నిర్వహించానని, విధులకు సక్రమంగా హాజరు కాని సిబ్బందిని మందలించాల్సి వచ్చేదన్నారు. వారంతా ఏకమై తనను భయపెట్టి బదిలీపై వెళ్లేలా చేసేందుకే ఇలా క్షుద్ర పూజలు నిర్వహించారని వివరించారు. కాగా, కార్యాలయ తాళాలు అసిస్టెంట్ డెరైక్టర్ వద్దే ఉంటాయని, ఆయనకు తెలియకుండా మరొకరు కార్యాలయంలోకి వచ్చి క్షుద్ర పూజలు ఎలా నిర్వహిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆయన తన కుర్చీ వద్ద కాళీమాత ఫొటో ఉంచుకుని నిత్యం పూజలు నిర్వహిస్తుంటారని, ఉద్యోగులను దెబ్బతీయాలన్న దురుద్దేశంతో ఆయనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఉద్యోగులు పరస్పర ఫిర్యాదులు, విమర్శలు, ప్రతి విమర్శలు పాతపడిపోవడంతో క్షుద్ర పూజలతో బజారుకెక్కారు. -
కలెక్టరేట్ ముట్టడి భగ్నం
‘కడప కలెక్టరేట్ ముట్టడి’ భగ్నమైంది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యమించిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు ఈడ్చుకెళ్లి తమ ప్రతాపం చూపారు. ఈ ఉదంతంలో పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు స్వల్పంగా గాయపడ్డారు. మొత్తం సంఘటనతో కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. - కడప స్పోర్ట్స్ డీవైఎఫ్ఐ పిలుపు మేరకు క్రీడా పాఠశాల విద్యార్థులు కడప కలెక్టరేట్‌ను శనివారం ముట్టడించారు. తమ సమస్యలను కలెక్టర్‌తోనైనా చెప్పుకుందామని ఆశించిన వచ్చిన విద్యార్థులు సభా భవనంలో కలెక్టర్ కేవీ రమణను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ఆ సమయంలో అధికారులతో సమావేశమైనట్లు తెలుసుకున్న విద్యార్థులు అక్కడే బైఠాయించి ‘కలెక్టర్ బయటికి రావాలంటూ’ నినాదాలు చేశారు. కలెక్టర్‌ను కలిసేందుకు కొంత మంది విద్యార్థులను అనుమతించారు. క్రీడా పాఠశాలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కలెక్టర్ నుంచి వచ్చిన సమాధానం విని విద్యార్థులు విస్తుపోయారు. ‘నాకు అంతా తెలుసు. మీరు వెళ్లి బుద్ధిగా చదువుకోండి. అనుమతి లేకుండా పాఠశాల నుంచి తరచూ వచ్చి ఇటువంటి ఆందోళనలకు దిగితే చర్యలు తప్పవని’ కలెక్టర్ తమను హెచ్చరించడంతో విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. కలెక్టర్‌ను అడ్డుకునే యత్నం సభా భవనం నుంచి బయటికి వచ్చిన కలెక్టర్‌ను చుట్టుముట్టేందుకు ఆందోళనకారులు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆందోళనకారులు పట్టువిడవకపోవడంతో చేసేది లేక పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. సంఘటనలో కొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు డీవైఎఫ్ఐ నాయకులు శివకుమార్, సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయం ఎదుట మళ్లీ బైఠాయించారు. సూపర్వైజర్లపై చర్యకు డిమాండ్ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడమే గాక వేధింపులకు గురి చేస్తున్న సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ నాయకులు శివకుమార్, భరత్ డిమాండ్ చేశారు. క్రీడా పాఠశాలలో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా విద్యార్థులు సుమారు నాలుగు గంటల వరకు బైఠాయించి నిరసన తెలిపారు. అంతలోనే అక్కడికి విచ్చేసిన డీఆర్ఓ సులోచన ఆందోళనకారులతో సంప్రదించారు. ‘మీరు వెళ్లే సమయానికి అక్కడ హాస్టల్ సూపర్వైజర్లు లేకుండా చేస్తామని’ ఆమె ఇచ్చిన హామీతో వారు ఆందోళన విరమించారు. -
కడపలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లా కలెక్టరేట్లో వరద సహాయక చర్యల్లో భాగంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బుధవారం కడపలో వెల్లడించారు. అందులో భాగంగా 08562- 246344 ఫోన్ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1077ను కూడా ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ముద్దునూరు మండలం కలమలలోని కృష్ణా నగర్వంక పొంగిపొర్లుతుంది. దాంతో ఆ నీటి ప్రవాహంలో పడి ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ గల్లంతైంది. అలాగే చన్నమండం మండలంలో కూడా వరదలు పోటెత్తాయి. దాంతో మాండవ్య నదీలోని నీటి ప్రవాహ వేగం మరింత ఉధృతంగా మారింది. దాంతో రహదారులు ఎక్కడికక్కడ తెగిపోయాయి. జిల్లాలోని శ్రీనివాస రిజర్వాయర్‌లో వరద నీరు భారీగా చేరింది. దాంతో ఆ ప్రాజెక్టు సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. -
జీతాల బిల్లులు చేస్తున్న డీటీఓ
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం ఓ వైపు ఉద్యోగులు సమ్మెలో ఉండగా జిల్లా ట్రెజరీ అధికారి కెఎన్‌పి రంగప్ప ఇంట్లో కూర్చొని జీతాల బిల్లులు చేస్తున్నారు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి భాస్కర్ సహాయంతో న్యాయశాఖ, అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ ఉద్యోగుల జీతాల బిల్లులు రాస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ట్రెజరీ ఉద్యోగులు ఆగస్టు 13వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం(ఎస్మా) కింద చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరించడంతో పాటు జీఓ 177 ప్రకారం పని చేయకపోతే జీతాలు ఇవ్వబోమని బెదిరించింది. అయినప్పటీకీ అటెండర్ నుంచి సబ్ ట్రెజరీ అధికారి వరకు సమ్మెలో ఉండగా డీటీఓ మాత్రం బిల్లులు చేయడం వివాదానికి దారితీస్తోంది. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ డీటీఓను వివరణ కోరగా ఖజానాశాఖ రాష్ట్ర డెరైక్టర్ ఆదేశాల మేరకే న్యాయ, అగ్నిమాపక, పోలీసు శాఖల ఉద్యోగుల బిల్లులను చేస్తున్నామని వివరించారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్, జిల్లా శాఖ కార్యదర్శి ప్రసాద్‌రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చే ఇలాంటి చర్యలను తాము ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ట్రెజరీ గెజిటెడ్ అధికారుల సంఘం సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ డీటీఓ బిల్లులు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.